భారత రాజ్యాంగ కమిషన్స్ మరియు ఏర్పడిన సంవత్సరాలు...


1. కింద ఇవ్వబడిన ప్రజా సంస్థలను హైదరాబాద్ రాష్ట్రంలో వాటి స్థాపనా సంవత్సరాన్ని బట్టి వరుస క్రమంలో తెలపండి . 
ఎ . హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 
బి . ఆర్యసమాజ్ 
సి . ఆంధ్ర జన సంఘం 
డి . ఆంధ్ర మహాసభ 
కింద ఇచ్చిన జవాబుల్లో సరైనదాన్ని ఎంచుకోండి 
1. సి , బి , ఎ , డి 
2. ఎ , సి , బి , డి 
3. సి , ఎ , బి , డి 
4.. బి , సి , డి , ఎ 
1. List the following public institutions in Hyderabad State in chronological order according to the year of their establishment.
A. Hyderabad State Congress
B. Arya Samaj
C. Andhra Jan Sangam
d. Andhra Mahasabha
Choose the correct one from the answers given below
1. C, B, A, D
2. A, C, B, D
3. C, A, B, D
4.. B, C, D, A

2. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే చారిత్రాత్మక విధిని భారత రాజ్యాంగ నిర్మాణ సభ దాదాపు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది . ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించడానికి ఎన్ని సమావేశాలు , ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు ? 
1. 10 సమావేశాలు , మొత్తం 220 రోజులు 
2. 09 సమావేశాలు , మొత్తం 360 రోజులు 
3. 12 సమావేశాలు , మొత్తం 245 రోజులు 
4. 11 సమావేశాలు , మొత్తం 165 రోజులు 
2. The Constituent Assembly of India completed the historic task of drafting the Constitution of independent India in about 3 years. How many meetings and how many days were taken to discuss the draft constitution?
1. 10 sessions, total 220 days
2. 09 meetings, total 360 days
3. 12 sessions, total 245 days
4. 11 meetings, total 165 days

3. ఈ కింద ఇవ్వబడిన కమిషను , వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్టును రెండవ లిస్టుకు జతపరుచుము . సరైన జవాబును కింద ఇవ్వబడిన కోడ్ ద్వారా సూచించుము ? 
లిస్ట్ -1 లిస్ట్ -2 
ఎ . సైమన్ కమిషన్ 1. 1946
బి . కేబినెట్ మిషన్ 2. 1932 
సి . మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 3. 1927 
డి . క్రిప్స్ మిషన్ 4. 1942 
1. ఎ -1 , బి -2 , సి -3 , డి -4 
2. ఎ -3 , బి -1 , సి -2 , డి -4 
3. ఎ -3 , బి -2 , సి -4 , డి -1
4. ఎ -4 , బి -1 , సి -2 , డి -3 
3. Append the first list to the second list with respect to the commission given below and the years in which they were constituted. Indicate the correct answer by the code given below ?
List-1 List-2
A. Simon Commission 1. 1946
B. Cabinet Mission 2. 1932
C. Third Round Table Conference 3. 1927
d. Cripps Mission 4. 1942
1. A-1, B-2, C-3, D-4
2. A-3, B-1, C-2, D-4
3. A-3, B-2, C-4, D-1
4. A-4, B-1, C-2, D-3

4. రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలను సరైన క్రమంలో పెట్టుము ? 
ఎ . లౌకిక 
బి . ప్రజాస్వామ్య 
సి . గణతంత్ర 
డి . సామ్యవాద 
ఇ . సార్వభౌమ 
1. డి , బి , ఎ , ఇ , సి 
2. ఇ , డి , ఎ , బి , సి 
3. ఎ , బి , డి , సి , ఇ 
4. సి , డి , బి , ఎ , ఇ
4. Put the following words in the Preamble of the Constitution in correct order?
A. Secular
B. democratic
C. Republic
d. Socialist
e. sovereign
1. D, B, A, E, C
2. E, D, A, B, C
3. A, B, D, C, E
4. C, D, B, A, E

5. రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ భారత గణతంత్రాన్ని ' రాష్ట్రాల కలయిక'గా ప్రకటిస్తుంది . దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు ? 
1. భారతదేశంలో రాష్ట్రాలు అమెరికా దేశం తరహాలో ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినది కాదు . 
2. రాష్ట్రాలకు ఈ కలయిక నుంచి విడిపోయే హక్కు ఉన్నది 
3. రాష్ట్రాలకు ఈ కలయిక నుంచి విడిపోయే హక్కు లేదు 
4. ఈ రాష్ట్రాల కలయికను ఇండియా అనగా భారతదేశంగా పిలుస్తారు 
5. The First Article of the Constitution declares the Republic of India to be a 'Union of States'. Which of the following is not correct regarding this?
1. States in India were not formed under a treaty like that of America.
2. States have the right to secede from this union
3. States have no right to secede from this combination
4. The combination of these states is known as India.

6. కింద ఇవ్వబడిన లిస్ట్ -1 లోని రాజ్యాంగ సవరణలను లిస్ట్ -2 లోని సంబంధిత ప్రాథమిక హక్కులతో జతపరిచి సరైన జవాబును ఇవ్వండి ?
లిస్ట్ -1 లిస్ట్ -2 
ఎ . మొదటి సవరణ 1. విద్యాహక్కు 
బి . 86 వ సవరణ 2 .సంఘాలు ఏర్పాటు చేసే హక్కు 
సి . 97 వ సవరణ 3 . ఎస్సీ , ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు
డి . 77 వ సవరణ 4. వాక్ స్వేచ్ఛ 
5. సమానత్వపు హక్కు 
1. ఎ -1 , బి -3 , సి -2 , డి -5 
2. ఎ -4 , బి -1 , సి -2 , డి -3 
3. ఎ -5 , బి -1 , సి -2 , డి -3 
4. ఎ -2 , బి -1 , సి -5 , డి - 3
6. Match the constitutional amendments in List-1 given below with the corresponding fundamental rights in List-2 and give the correct answer?
List-1 List-2
A. First Amendment 1. Right to Education
B. 86th Amendment 2. Right to form associations
C. 97th Amendment 3. Reservations in promotions for SC and ST employees
d. 77th Amendment 4. Freedom of Speech
5. Right to equality
1. A-1, B-3, C-2, D-5
2. A-4, B-1, C-2, D-3
3. A-5, B-1, C-2, D-3
4. A-2, B-1, C-5, D-3

7. కింద ఇవ్వబడిన తీర్పులలో ఏది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తలెత్తిన ఇబ్బందులు అధిగమించడానికి 15 వ అధికరణంలో ( 4 ) పక్లాజ్ను రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ? 
1. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్
2. ఇంద్ర సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 
3. రాంసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 
4. ఎం.ఆర్.బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్
7. In which of the judgments given below, to overcome the difficulties arising from the judgment of the Supreme Court, clause (4) of Article 15 was inserted by constitutional amendment?
1. State of Madras vs. Champakam Dorai Rajan
2. Indra Sahani vs. Union of India
3. Ramsingh v. Union of India
4. M.R.Balaji v. State of Mysore

8. ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడిన వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛను కింద ఇవ్వబడిన ఏ కారణం చేత నియంత్రించరాదు ? 
1. నేరాన్ని ప్రేరేపించినప్పుడు 
2. కోర్టు ధిక్కారం 
3. విదేశ రాష్ట్రాలతో స్నేహ పూర్వక సంబంధాలు 
4. దేశ ద్రోహం 
8. The freedom of speech and expression granted to citizens of India under Article 19 cannot be restricted for which of the following reasons?
1. When the crime is committed
2. Contempt of Court
3. Friendly relations with foreign states
4. Treason

9. ఒక వ్యక్తి సమ్మతం లేకుండా చేసే నార్కో అనాలిసిస్ ( సత్యశోధన ) లాంటి పరీక్షలు రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఇవ్వబడిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తామని సుప్రీంకోర్టు 2010 వ సంవత్సరంలో తీర్పు చెప్పింది ? 
1. 20 ( 1 ) 
2. 20 ( 2 ) 
3. 20 ( 3 ) 
4. 22 
9. The Supreme Court ruled in 2010 that tests like narco-analysis (satya shodhana) carried out without the consent of a person violate the fundamental right granted under which Article of the Constitution?
1. 20 (1)
2. 20 (2)
3.20 (3)
4. 22

10. పంపిణీ న్యాయం అనే ఉద్దేశ్యం రాజ్యాంగంలోని ఈ కింది అధికరణల ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలో ఉన్నది ? 
1. అధికరణం 39 ( ఎ ) & ( బి ) 
2. అధికరణం ( 39 ) ( బి ) & ( సి )
3. అధికరణం ( 39 ) ( సి ) & ( డి ) 
4. అధికరణం ( 39 ) ( ఇ ) & ( ఎఫ్ )
10. The concept of distributive justice is contained in the directive principles enshrined in the following Articles of the Constitution?
1. Article 39 (a) & (b)
2. Article (39) (b) & (c)
3. Article (39) (c) & (d)
4. Article (39) (e) & (f)

Answers::


1 ) 1 , 2 ) 4 , 3 ) 2 , 4 ) 2 , 5 ) 2 , 6 ) 2 , 7 ) 1 , 8 ) 4 , 9 ) 3 , 10 ) 2 

Top

Below Post Ad