ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికా అధికారాలు ఏ జాబితాలో పొందుపరిచారు ?

1. ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికా అధికారాలు ఏ జాబితాలో పొందుపరిచారు ?
1. కేంద్ర జాబితా
2. రాష్ట్ర జాబితా
3. ఉమ్మడి జాబితా
4. అవశిష్ఠ అధికారాలు
1. Economic and social planning powers are enshrined in which list?
1. Central list
2. List of State
3. Joint List
4. Residual Powers

2. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను సస్పెండ్ చేయడానికి వీలు లేదు ?
1. ఆర్టికల్ 32
2. ఆర్టికల్ 21
3. ఆర్టికల్ 19
4. ఆర్టికల్ 15
2. Which article of the constitution cannot be suspended during the imposition of national emergency?
1. Article 32
2. Article 21
3. Article 19
4. Article 15

3. క్రింది వాక్యాలను పరిశీలించుము.
ఎ . విద్యా హక్కు చట్టం 2009 సం॥లో ఆమోదించారు .
బి . విద్యా హక్కు చట్టం విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది .
సి . 6-14 సంవత్సరాలలో లోపు పిల్లలందరికీ ఉచిత & నిర్బంధ విద్య ఇవ్వాలని విద్యా హక్కు చట్టం ప్రకటించింది .
పై వాక్యాలలో ఏది / ఏవి సరైనవి.
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. ఎ మరియు సి
4. ఎ , బి మరియు సి
3. Examine the following sentences.
A. Right to Education Act 2009 passed.
B. The Right to Education Act declares education as a fundamental right.
C. The Right to Education Act declared that all children between 6-14 years of age should be given free and compulsory education.
Which of the above sentences is/are correct?
1. A and B
2. B and C
3. A and C
4. A, B and C

4. విదేశీయులు భారత పౌరసత్వం కొరకు దరఖాస్తు చేయుటకు ముందు భారతదేశంలో ఎన్ని సంవత్సరములు నివసించి ఉండవలెను.
1. 3 సంవత్సరాలు
2. 5 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు
4. 7 సంవత్సరాలు
4. How many years should foreigners have lived in India before applying for Indian citizenship?
1. 3 years
2. 5 years
3. 6 years
4. 7 years

5. క్రింది ప్రవచనములు చదువుము.
ఎ . ప్రతిరోజు పార్లమెంట్ మొదటి గంట సమయం ప్రశ్నోత్తరముల కొరకు కేటాయించబడింది .
బి . పార్లమెంటరీ సాంప్రదాయాలలో భారతదేశ విలక్షణ ఆవిష్కరణ శూన్యగంట ( జీరో అవర్ )
సి . కార్యనిర్వహక చర్యలపై న్యాయ నియంత్రణ న్యాయం నుండి వచ్చినది .
సరైన సమాధానము గుర్తించుము ?
1. ఎ నిజం కాని బి మరియు సిలు తప్పు
2. ఎ , బి మరియు సిలు అన్ని నిజం
3. ఎ , బి మరియు సి లు అన్ని తప్పు
4. ఎ మరియు బి , సిలు తప్పు మరియు బి నిజం
5. Read the following verses.
A. The first hour of Parliament every day is reserved for Question and Answer.
B. Shunyaganta (Zero Hour) is India's unique innovation in parliamentary traditions.
C. Judicial control over executive actions derives from justice.
Identify the correct answer?
1. A is true but B and C are false
2. A , B and C are all true
3. A, B and C are all wrong
4. A and B , C is false and B is true

6. భారత రాష్ట్రపతులలో కార్మిక ఉద్యమాలతో సంబంధం కలవారు.
1. వి.వి.గిరి
2. ఎన్ . సంజీవరెడ్డి
3. జాఖీర్ హుస్సేన
4. ఆర్ . వెంకటరామన్
6. Among the Presidents of India associated with labor movements.
1. V.V.Giri
2. N. Sanjiva Reddy
3. Zakir Hussain
4. R. Venkataraman

7. భారత సుప్రీంకోర్టు ' న్యాయ సమీక్ష అధికారాన్ని కల్గి ఉంది . న్యాయ సమీక్ష అనగా
ఎ . రాష్ట్ర హైకోర్టు తీర్పులను సమీక్షించడం
బి . మంత్రిమండలి విధులను సమీక్షించడం
సి . భారత రాష్ట్రపతికి సలహా ఇవ్వడం
డి . శాసనశాఖ ఆమోదించిన చట్టాలు , కార్యనిర్వహక శాఖ ఆదేశాల రాజ్యాంగ బద్దతను నిర్ణయించుట .
సరైన సమధానము.....
1. ఎ మరియు బి 
2. బి మరియు సి
3. డి మాత్రమే
4. సి మరియు డి
7. The Supreme Court of India has the power of judicial review. Judicial review viz
A. Review of State High Court judgments
B. To review the functions of the Council of Ministers
C. Advising the President of India
d. To determine the constitutionality of laws passed by the Legislature and orders of the Executive.
The correct answer is….
1. A and B
2. B and C
3. D only
4. C and D

8 . 1952 లో ఏర్పడిన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గమునకు సంబంధించి సరికానిది ఏది ?
1. మెహిదినవాబ్ జంగ్ - ప్రజారోగ్యము ప్రజాపనులు
2. ఎం . చెన్నారెడ్డి - వ్యవసాయము మరియు ప్రణాళిక
3. దిగంబర రావు బంధు - అంతరంగిక వ్యవహారాలు
4. శంకర్దేవ్ - విద్య మరియు గ్రామీణ అభివృద్ధి
8. Which of the following is incorrect regarding the Burgula Ramakrishna Rao cabinet formed in 1952?
1. Mehdinawab Jung - Public health is public works
2. M. Chenna Reddy - Agriculture and Planning
3. Digambara Rao Bandhu - Internal affairs
4. Shankardev - Education and Rural Development

9. ఈ క్రింది వానిలో సరైన జత ఏది ?
ఎ . ఎ.డి.ఎమ్ జబల్పుర్ అత్యవసర పరిస్థితి విధించిన వాజ్యము సమయంలో పౌరహక్కులు :
బి . విశాఖ వాజ్యము : కేంద్ర రాష్ట్ర సంబంధాలు
సి . ఇందిరా సహాని : పని ప్రదేశంలో మహిళల హక్కులు వాజ్యము
డి . కర్తార్ సింగ్ వాజ్యము : మైనారిటీల హక్కులు
సరైన సమాధానము....
1. ఎ
2. బి
3. సి
4. డి
9. Which of the following is the correct pair?
A. ADM Jabalpur Civil Rights during Emergency Imposition:
B. Visakha Vayyam : Centre-State Relations
C. Indira Sahani: Women's rights at workplace matter
d. Kartar Singh Law: Rights of Minorities
The correct answer is….
1. A
2. b
3. C
4. d

10. ఈ కింది ప్రవచనములు పరిశీలించుము.
ఎ . మొదటి జాతీయ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషన్ 1992 సం॥లో ఏర్పాటు చేయబడింది .
బి . 65 వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటి జాతీయ షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ ఏర్పాటు చేయబడింది .
సి . జాతీయ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్ సి . హెచ్ . హనుమంతప్ప.
పైన ఇచ్చిన ప్రవచనములలో ఏది సరైనది ?
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. ఎ మరియు సి
4. ఎ , బి మరియు సి
10. Consider the following prophecies.
A. The first National Scheduled Castes and Scheduled Tribes Commission was constituted in 1992.
B. The first National Commission for Scheduled Castes and Scheduled Tribes was established by the 65th Constitutional Amendment.
C. The first chairman of the National Commission for Scheduled Castes and Scheduled Tribes was C. H. Hanumanthappa.
Which of the above predictions is correct?
1. A and B
2. B and C
3. A and C
4. A, B and C

11. కింది పవచనములు పరిశీలించుము ' ఆర్టికల్ 356 ' ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ఒక సంవత్సరము మించి కొనసాగించాలంటే.
ఎ . ఆ రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ధారణ చేయాలి .
బి . రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ నిర్ధారించవలెను .
సి . ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారించవలెను .
డి . స్వతంత్ర్య పరిశోధన ద్వారా తెలుసుకాని , రాష్ట్రంలో తీవ్రపరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందవలెను .
పైన ఇచ్చిన ప్రవచన ములలో ఏది సరైనది .
1. ఎ మాత్రమే
2. బి మరియు సి
3. సి మాత్రమే
4. ఎ మరియు డి
11. Consider the following verses under 'Article 356' to continue the state of emergency in a state for more than one year.
A. The High Court of that State should confirm that there are serious conditions in that State.
B. The governor should ensure that peace and security in the state is not under control.
C. The Election Commission should confirm that it is difficult to hold assembly elections in that state.
d. The President should be satisfied that the situation is continuing in the state despite not being known through an independent investigation.
Which of the above statements is correct?
1. A only
2. B and C
3. C only
4. A and D

12. ఈ కింది ప్రవచనములు పరిశీలించుము ఒక రాజకీయ పార్టీకి చెందిన శాసన సభ్యుడు క్రింద పరిస్థితులలో తన శాసన సభ్యత్వానికి అనర్హుడు అవుతాడు .
ఎ . తన పార్టీ నుండి బహిష్కరణకు గురైనప్పుడు
బి . తన పార్టీని స్వచ్ఛందంగా వదిలి పెట్టినప్పుడు
సి . తన పార్టీ జారీ చేసిన విపు వ్యతిరేకంగా శాసనసభలో ఓటు వేసినప్పుడు లేదా గైర్హాజర్ అయినపుడు .
పైన ఇచ్చిన ప్రవచనములలో ఏది సరైనది .
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. ఎ , బి మరియు సి
4. ఎ మాత్రమే
12. Consider the following propositions A legislator belonging to a political party shall be disqualified from his legislative membership under the following circumstances.
A. When expelled from his party
B. When he left his party voluntarily
C. When he votes against a bill issued by his party or is absent in the Legislative Assembly.
Which of the above statements is correct?
1. A and B
2. B and C
3. A, B and C
4. A only

13. ప్రతిపాదన ఎ : దేశంలో ఉనికిలో గల ఏ రాష్ట్ర సరిహద్దులనైనా మార్చే అధికారం పార్లమెంట్కు గలదు . కారణము ( ఆర్ ) : రాష్ట్ర సరిహద్దులను మార్చి బిల్లును కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టవలెను
సమాధానము :
1. ఎ మరియు ఆర్ లు రెండు నిజం మరియు , ఎ కి ఆర్ సరైన వివరణ .
2. ఎ మరియు ఆర్ రెండూ నిజం కాని ఎ కి ఆర్ సరైన వివరణ కాదు.
3. ఎ నిజం కాని ఆర్ తప్పు .
4. ఎ తప్పు కాని ఆర్ నిజం .
13. Proposition A: Parliament has the power to change the boundaries of any state existing in the country. Reason (R) : The bill to change the boundaries of the state should be introduced in the Rajya Sabha only
Answer:
1. Both A and R are true and A and R are the correct explanation.
2. Both A and R are true but A is not a correct explanation of R.
3. A is true but R is false.
4. A is false but R is true.

14. ఈ క్రింది ప్రవచనములు చదువుము.
ఎ . అఖిల భారత సర్వీసుల నిబంధనలు భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు
బి . జాతీయాభివృద్ధి మండలి ప్రస్తావన భారత రాజ్యాంగంలో లేదు .
సి . స్టాంపు డ్యూటీని కేంద్రం విధిస్తుంది , రాష్ట్రాలు వాటిని వసూలు చేసుకొని వినియోగించవచ్చు సరైన జవాబు...
1. ఎ నిజం కాని సి మరియు బిలు తప్పు
2. ఎ , బి మరియు సి లు నిజం
3. ఎ మరియు సిలు అన్ని తప్పు కాని బి ఒప్పు
4. ఎ మరియు బిలు తప్పు మరియు సి నిజం
14. Read the following verses.
A. The provisions of All India Services are clearly mentioned in the Constitution of India
B. There is no mention of National Development Council in the Constitution of India.
C. Stamp duty is levied by the center and the states can collect and use them Correct Answer...
1. A is true but C and B are false
2. A, B and C are true
3. A and C are all false but B is true
4. A and B are false and C is true

Answers ::

1 ) 3 , 2 ) 2 , 3 ) 4 , 4 ) 2 , 5 ) 2 , 6 ) 1 , 7 ) 3 , 8 ) 4 , 9 ) 1 , 10 ) 1 , 11 ) 3 , 12 ) 2 , 13 ) 3 , 14 ) 2

Top

Below Post Ad