ఎస్బీఐలో 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ( సీబీవో ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
» మొత్తం పోస్టుల సంఖ్య : 5447 ( రెగ్యులర్ ఖాళీలు -5,280 , బ్యాక్ లాగ్ ఖాళీలు - 167 ) .
» ఎస్బీఐ సర్కిళ్లు : అహ్మదాబాద్ , అమరావతి , బెంగళూరు , భోపాల్ , భువనేశ్వర్ , చండీగఢ్ , చెన్నై , నార్త్ ఈస్ట్రన్ , హైదరాబాద్ , జైపూర్ , లక్నో , కోలకతా , మహారాష్ట్ర , ముంబై మెట్రో , న్యూఢిల్లీ , తిరువనంతపురం .
» అర్హత : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్స మాన అర్హత కలిగి ఉండాలి . బ్యాంకింగ్ రంగం లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
» వయసు : 31.10.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి .
» వేతనం : నెలకు రూ .36,000 నుంచి రూ .63,840 » ఎంపిక విధానం : ఆన్లైన్ రాతపరీక్ష , స్క్రీనింగ్ టె స్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు .
» తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు : గుంటూరు , కర్నూలు , విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 12.12.2023 .
» వెబ్సైట్ : www.sbi.co.in