ప్రభుత్వ ఉద్యోగాలు సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్ / రైఫిల్‌మ్యాన్ పోస్టులు భర్తీ కానున్నాయి .
1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్ ) : 6,174 ( పురుషులు- 5,211 ; మహిళలు- 963 )
2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( సీఐఎస్ఎఫ్ ) : 11,025 ( పురుషులు- 9,913 , మహిళలు- 1,112 )
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్ ) : 3,337 ( పురుషులు- 3,266 , మహిళలు- 71 )
4. సశస్త్ర సీమాబల్ ( ఎస్ఎస్బీ ) : 635 ( పురుషులు- 593 , మహిళలు- 42 )
5.ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ఐటీబీపీ ) : 3,189 ( పురుషులు- 2,694 , మహిళలు- 495 )
6. That's రైఫిల్స్ ( ఏఆర్ ) 1,490 ( పురుషులు- 1,448 , మహిళలు- 42 ) 7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ( ఎస్ఎస్ఎఫ్ ) : 296 ( పురుషులు- 222 , మహిళలు- 74 )
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి .
పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు , మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు .
వయసు : జనవరి 01 , 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి . ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు , ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది .
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , వైద్య పరీక్షల ఆధారంగా .
దరఖాస్తు రుసుము : రూ .100 ( మహిళలు / ఎస్సీ / ఎస్టీ / మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది ) . ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31-12-2023 . వెబ్సైట్ : https://ssc.nic.in/