Hot Widget

Type Here to Get Search Results !

అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024. Last date? Eligibility? Process?

సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్... 'అగ్ని పథ్ కింద 2024-25 సంవత్సరం నియామకాలకు సంబంధించి అగ్నివీరుల ఎంపిక కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ జిల్లాల అభ్యర్థులు అర్హులు: ఆదిలాబాద్, భద్రాద్రి హైదరాబాద్.

కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫా బాద్, మహబూబ్నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరం గల్, హనుమకొండ, యాదాద్రి ములుగు, నారాయణపేట. భువనగిరి,


కేటగిరీలు...

1. అగ్నివీర్ జనరల్ డ్యూటీ

2. అగ్నివీర్ (ఆల్ ఆర్మ్స్)

3. అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నిక

4. అగ్నివీర్ ట్రేడ్స్మన్(టెన్త్ పాస్)(ఆల్ ఆర్మ్స్)

5. అగ్నివీర్ ట్రేడ్స్మన్(8వ తరగతి ఉత్తీర్ణత) 


వయోపరిమితి: 17 1/2 నుంచి 21 సంవ

త్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 2003 అక్టోబరు 1 నుంచి 2007 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.

అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి/మెట్రిక్యులేషన్, 10+2/ఇంటర్మీడియ ట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ లేదా ఆర్ట్స్, కామర్స్, సైన్స్), సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎత్తు(సెం.మీల్లో): అగ్నివీర్ జీడీ/ట్రేడ్స్మన్-166, అగ్నివీర్ టెక్నికల్-165, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ 555-162.

ఛాతీ కొలత: గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరణతో 77 సెం.మీ. ఉండాలి.

పరీక్ష ఫీజు: రూ.250

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత

పరీక్ష, రిక్రూట్మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్/ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువప త్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: మార్చి 22

ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం: ఏప్రిల్ 22 355: joinindianarmy.nic.in/

Tags

Top Post Ad

Below Post Ad