1వ సవరణ(అమల్లోకి వచ్చిన తేది: 1951, జూన్ 18)
సవరించిన ప్రకరణలు:15, 19, 85, 87, 174, 176, 341, 342,372, 376.
* కొత్తగా చేర్చినవి: 31ఎ, 31బి ప్రకరణలు,షెడ్యూల్ 9.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యఅంశాలు:
* స్వేచ్ఛ, సమానత్వ, ఆస్తి హక్కులపై ప్రజా
ప్రయోజనం దృష్ట్యా నియంత్తణ విధించారు.
* భూ సంస్కరణలకు సంబంధించిన అంశా
లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు. ఈ
షెడ్యూల్లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్ష
పరిధిలోకి రావు. అసెంబ్లీల సమావేశ
కాలాలు, న్యాయాధికారుల నియామకాలు.
2వ సవరణ (1953, మే1)
* సవరించిన ప్రకరణ- 81
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యఅంశాలు:
* ఇది పార్లమెంటులో రాష్ట్రాలకు కేటాయించిన
సీట్ల (స్థానాలు) మార్పుకు సంబంధించిన
సవరణ.
3వ సవరణ (1955, ఫిబ్రవరి 22)
* ఏడో షెడ్యూల్ను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు:
ముడిపత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి, పశువు లకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
4వ సవరణ (1955, ఏప్రిల్ 27)
* సవరించిన ప్రకరణలు: 31, 31 ఎ, 305. * * తొమ్మిదో షెడ్యూల్ ని కూడా సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు:
* భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న ఆస్తులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని కోర్టుల పరిధికి వెలువల ఉంచారు.
5వ సవరణ (1955, డిసెంబర్ 24)
* ప్రకరణ 3ను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు:
రాష్ట్రపతి.. రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు, పేర్లను మార్చే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపిస్తారు. వాటిపై సమాధానం చెప్పేందుకు రాష్ట్రాలకు నిర్దిష్ట సమయం ఇస్తారు.
6వ సవరణ (1956, సెప్టెంబర్ 11)
* సవరించిన ప్రకరణలు – 269, 286.
* ఏడో షెడ్యూల్‌లోని 1వ జాబితా, 2వ జాబితాకు సవరణలు చేశారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు..
* అంతర్రాష్ట్ర వాణిజ్యపు పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
7వ సవరణ (1956, నవంబర్ 1)
* సవరించిన ప్రకరణలు: 1, 49, 80, 81, 82, 131, 153, 158, 168, 170, 171, 216, 217, 220, 222, 224, 230, 231,232,371.
* కొత్తగా చేర్చిన ప్రకరణలు: 258 ఎ, 290 ఎ, 350 ఎ, 350 బి, 372 ఎ, 378 ఎ.
* తొలగించిన ప్రకరణలు: 238, 242, 243, 259, 278, 306, 379, 391.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు...
* రాష్ట్రాల పునర్విభజన ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
* లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల స్థానాలు మార్పు.
* హైకోర్టులో తాత్కాలిక అదనపు న్యాయమూర్తు ల నియామకానికి అవకాశం కల్పించారు.
* కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో మార్పులు చేశారు.
* ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు చేర్చారు.
* ఒకే వ్యక్తిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించే అవకాశం కల్పించారు.
8వ సవరణ (1960, జనవరి 5)
* సవరించిన ప్రకరణ: 334
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు:
షెడ్యూల్ కులాలు, తెగలు, ఆంగ్లో-ఇం డియన్లకు లోక్‌సభ, శాసనసభల్లో కేటాయిం చిన స్థానాలను 1970 వరకు పొడిగించారు.
9వ సవరణ (1960, డిసెంబర్ 28)
* మొదటి షెడ్యూల్‌ను సవరించారు.
* పశ్చిమబెంగాల్ ఆమోదించింది.
ముఖ్యలక్ష్యాలు:
బేరుబరీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు బదిలీ చేయడానికి ఈ సవరణ చేశారు.
10వ సవరణ (1961, ఆగస్టు 11)
* ప్రకరణ 240తో పాటు మొదటి షెడ్యూల్‌ను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు...
దాద్రానగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతం గా భారతదేశంలో విలీనం చేశారు.
11వ సవరణ (1961, డిసెంబర్ 19)
* సవరించిన ప్రకరణలు:66 (1), 71 (3)
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు:
* రాష్ట్రపతి/ఉప రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన అంశాలను సవరించారు.
* రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలు ఉన్నా యనే నెపంతో ఎన్నికలను వాయిదా వేయరాదు.
12వ సవరణ (1961, డిసెంబర్ 20)
* ప్రకరణ 240తోపాటు మొదటి షెడ్యూల్‌ను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు...
* గోవా, డామన్-డయ్యూలను భారత్‌లో విలీనం చేశారు.
13వ సవరణ (1963, డిసెంబర్ 1)
* కొత్తగా ప్రకరణ 371 ఎ చేర్చారు.
* నాగాలాండ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
14వ సవరణ (1962, డిసెంబర్ 28)
* 239 ఎ, 241 ప్రకరణలతోపాటు 1, 4 * * * షెడ్యూళ్ళలోని అంశాలను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు...
పాండిచ్చేరి (ప్రస్తుతం పుదుచ్చేరి)ని కేంద్ర పాలిత ప్రాంతంగా భారతదేశంలో చేర్చుకున్నారు. అలాగే ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక శాసనసభను, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవాలకు శాసనసభలను, మంత్రివర్గాన్ని ఏర్పరిచారు.
15వ సవరణ (1963, అక్టోబర్ 5)
* సవరించిన ప్రకరణలు: 124, 128, 217, 222, 224, 226, 297, 311, 316.
* నూతనంగా ప్రకరణ 224 ఎ చేర్చారు. 7వ షెడ్యూల్‌ను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు...
* హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.
* హైకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తులను పునర్నియమించే అవకాశం కల్పించారు.
* హైకోర్టు పరిధిని విస్తరించారు.
* ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలను సవరిం చారు.
16వ సవరణ (1963, అక్టోబర్ 5)
* 19, 84, 173 ప్రకరణలను, 3వ షెడ్యూల్‌ను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు...
ప్రకరణ 19లోని స్వేచ్ఛా హక్కుపై పరిమితులు, ఎంపీ, ఎమ్మెల్యే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీ ప్రమాణ స్వీకార ప్రక్రియలో మార్పు.
17వ సవరణ (1964, జూన్ 20)
* ప్రకరణ 31 ఎ, 9వ షెడ్యూల్‌ని సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
* ఎస్టేట్ పద నిర్వచనాన్ని మార్చారు.
* వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకో డ మౌర్తేట్ వీలు వెళ్ళించాలి.
18వ సవరణ (1966, ఆగస్టు 27)
* ప్రకరణ 3ని సవరించారు.
* ప్రకరణ 3లోని ‘రాష్ట్రం’ అనే మాటను పునర్నిర్వచించారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లను పునర్వ్యవస్థీకరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
19వ సవరణ (1966, డిసెంబర్ 11)
* సవరించిన ప్రకరణ–324
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు...
ఎన్నికల వివాదాలకు సంబంధించి ఎన్నికల ట్రిబ్యునల్ ఏర్పాటు.
20వ సవరణ (1966, డిసెంబర్ 22)
* నూతనంగా ప్రకరణ 233 ఎ చేర్చారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
ముఖ్యలక్ష్యాలు:
ఈ సవరణ ద్వారా జిల్లా జడ్జీల నియామక ప్రతిపాదనకు రాజ్యాంగంలో చేర్చారు.
21వ సవరణ (1967, ఏప్రిల్ 10)
* ఎనిమిదో షెడ్యూల్‌ను సవరించారు.
* సింధీని 15వ అధికార భాషగా 8వ షెడ్యూల్‌లో చేర్చారు.
22వ సవరణ (1969, సెప్టెంబర్ 25)
* 244 ఎ, 371 బి, 275 (1ఎ) ప్రకరణలను కొత్తగా చేర్చారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
* మేఘాలయను స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం గా ఏర్పాటు చేశారు.
* అసోం రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రాధాన్యాలు కల్పించారు.
23వ సవరణ (1970, జనవరి 23)
* 330,332,333,334 ప్రకరణలను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్ కులాలు, తరగతులు, ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్లను 1980 వరకు పొడిగించారు.
24వ సవరణ (1971, నవంబర్ 5)
* 13, 368 ప్రకరణలను సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు...
ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ని భాగాన్నయినా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు కల్పించారు.
25వ సవరణ (1972, ఏప్రిల్ 20)
* సవరించిన ప్రకరణ–31.
* కొత్తగా చేర్చిన ప్రకరణ– 31 సి.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
ముఖ్యలక్ష్యాలు...
‘నష్టపరిహారం’ అనే పదం స్థానంలో 'కొంత మొత్తం' అనే పదాన్ని చేర్చారు. ఆదేశిక నియ మాల్లోని 39 (బి), (సి) అమలుకు చట్టాలు చేస్తే వాటిని న్యాయస్థానాలు ప్రశ్నించరాదు.
26వ సవరణ (1971, డిసెంబర్ 28)
* సవరించిన ప్రకరణ–366; నూతనంగా చేర్చిన ప్రకరణ– 363 ఎ; తొలగించిన ప్రకరణలు– 291, 362.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
* రాజవంశీకులకు ఇచ్చే రాజభరణాలు, ప్రత్యేక సదుపాయాలను రద్దు చేశారు.
27వ ప్రకరణ (1972, ఫిబ్రవరి 15)
* 239 ఎ, 240 ప్రకరణలను సవరించారు; * * నూతనంగా ప్రకరణ 371 సి చేర్చారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
* ఈశాన్య రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు.
* ప్రకరణ 371 సి ప్రకారం మణిపూర్కు మంత్రి మండలి, అసెంబ్లీని ఏర్పాటు చేశారు.
28వ ప్రకరణ (1972, ఆగస్టు 29)
* నూతనంగా ప్రకరణ 312 అని చేర్చీ.. ప్రకరణ 314ను తొలగించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
* ఇండియన్ మాజీ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు గల ప్రత్యేక హక్కులు, హోదాలను తొలగించారు.
29వ సవరణ (1972, జూన్ 9)
* తొమ్మిదో షెడ్యూలును సవరించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
* కేరళ రాష్ట్ర భూ సంస్కరణల చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు.
30వ సవరణ (1973, ఫిబ్రవరి 27)
* సవరించిన ప్రకరణ - 133
* సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు గల రూ.20 వేల పరిమితిని తొలగించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
31వ సవరణ (1973, అక్టోబర్ 17)
* సవరించిన ప్రకరణలు - 81, 330, 332.
* లోక్‌సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 545కు పెంచారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 25 నుంచి 20కి తగ్గించారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
32వ సవరణ (1974, జూలై 1)
* 371 ఎ ప్రకరణను సవరించి... కొత్తగా 371 డి, 371 ఎ ప్రకరణలను చేర్చారు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
* ఆరు సూత్రాల పథకాన్ని చేర్చారు.
* 371-ఎ ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు.
33వ ప్రకరణ (1974, మే 19)
* సవరించిన ప్రకరణలు - 101, 190.
* పార్లమెంటు, శాసనసభ్యుల రాజీనామా పత్రాన్ని సభాధ్యక్షుడు తప్పువసరిగా ఆమోదించాలనే నిబంధనను తొలగించారు.
* సభ్యుడు ఇష్టపూర్వకంగా/స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాడని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే స్పీకర్ లేదా చైర్మన్ రాజీనామాను ఆమోదించాలి.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
34వ ప్రకరణ (1974, సెప్టెంబర్ 7)
* తొమ్మిదో షెడ్యూలును సవరించారు.
* తొమ్మిదో షెడ్యూల్ అధికార పరిధిని పెంచారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
35వ సవరణ (1975, మార్చి 1)
* 80, 81 ప్రకరణలను సవరించి.. కొత్తగా ప్రకరణ 2 ఎ చేర్చారు.
* సిక్కింకు సహా రాష్ట్ర హోదా కల్పిస్తూ పదో షెడ్యూలును కొత్తగా చేర్చారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
36వ సవరణ (1975, ఏప్రిల్ 26)
* నూతనంగా ప్రకరణ 371 ఎఫ్ చేర్చీ.. ప్రకరణ 2ఎను తొలగించారు.
* సిక్కింకు పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పడింది.
* పదో షెడ్యూలును తొలగించారు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
37వ సవరణ (1975, మే 3)
* నూతనంగా 239ఎ, 240 ప్రకరణలు చేర్చారు. కేంద్ర పాలిత ప్రాంత హోదా గల అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రదేశ్ కౌన్సిల్ స్థానంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిలర్ల స్థానంలో మంత్రిమండలి ఏర్పాటు.
* రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
38వ సవరణ (1975, ఆగస్టు 1)
* సవరించిన ప్రకరణలు:123, 213, 239 బి 352, 356, 359, 360.
ముఖ్యంగా:
* రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ జారీచేసే ఆర్డినెన్స్ లు కోర్టుల అధికారాల పరిధిలోకి రావని తీర్మానించారు.
* రాష్ట్రపతి విధించే అత్యావసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుంచి తప్పించారు. న్యాయ సమీక్షకు గురికాదు.
* రాష్ట్రాల ఆమోదం పొందింది.
39వ సవరణ (1975, ఆగస్టు 10)
* 71, 329 ప్రకరణలతో పాటు తొమ్మిదో షెడ్యూల్ను సవరించారు.
* రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయసమీక్ష పరిధిలోకి రావు.
* తొమ్మిదో షెడ్యూల్లో నూతన చట్టాలను చేర్చారు. రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
40వ ప్రకరణ (మే 27, 1976)
* 31 డి, 297 ప్రకరణలతో పాటు 9వ షెడ్యూల్‌ను సవరించారు. తన అధికార పరిధిలోని భౌగోళిక జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. దీనికి సంబంధించిన చట్టాలు చేసే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టారు.
* తొమ్మిదో షెడ్యూల్లో నూతన చట్టాలను చేర్చారు.