తెలంగాణ ఉద్యమం కమిటీలు... General Knowledge Bits...

1. అరవమందు అయ్యంగార్ కమిటీ....

* రాజ్యాంగ సంస్కరణల కమిటీ

* ఈ కమిటీని నిజాం ప్రభుత్వం 1937 సెప్టెంబర్ 22 ఏర్పాటు చేసింది.

* ఈ కమిటీని నివేదికను 1938 ఆగస్టు 31న ప్రభుత్వానికి (బాబే హుకుమత్) సమర్పించింది. కమిటీ నివేదికను 1939 జూలై 19న ప్రభుత్వం బహిరంగ పర్చింది.

నివేదికలోని అంశాలు :

* ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి.

* ప్రభుత్వ ఉద్యోగాల నియమానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి

* భావప్రకటన, పత్రికా స్వాతంత్ర్యాలు కల్పించాలి.

* ఎలాంటి నిర్బందాలు లేకుండా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించాలి.

2. పండిట్ సుందర్లాల్ కమిటీ :

* జె.ఎన్. చౌదరి అక్రమ పరిపాలపై నియమించబడిన కమిటీ

* కమిటీ చైర్మన్ - పండిట్ సుందర్ లాల్

సభ్యులు :

1) ఖాజీ అబ్దుల్ గఫార్

2) మౌలానా అబ్దుల్ మిస్త్రీ

కార్యదర్శులు : 1) ఫరూక్ సియర్ 2) పి.పి. అంబుల్కర్

* జె.ఎన్.చౌదరి అక్రమ పరిపాలన, మిలటరీ దురాగతులపై ప్రముఖ జర్నలిస్ట్ 'యూనిస్ సలీం' ఫిర్యాదు మేరకు కమిటీని ప్రధాని నెహ్రు నియమించాడు.

* కమిటీ 1948 నవంబర్ 29 నుండి డిసెంబర్ 21 వరకు 3 వారాలు హైద్రాబాద్లో పర్యటించి హైద్రాబాద్లోని 9 జిల్లాలు, 7 జిల్లా కేంద్రాలు, 109 గ్రామాల్లో కమిటీ పర్యటించింది.

కమిటీ నివేదిక :

* ఆపరేషన్ పోలో సమయంలో -ఆ తర్వాత 27 నుంచి 40 వేల మంది ముస్లింలు రజాకార్ల పేరుతో ఊచకోత కోయబడ్డారు. ముఖ్యంగా ఉస్మానాబాద్, గల్బర్గా, బీదర్, నాందేడ్లో దాదాపు 18 వేల మంది వరకు మిలటరీ దాడుల్లో మరణించారు.

* లాఠీలు, గృహదహనాలు, ఆస్తుల విధ్వంసం, మూకుమ్మడి హత్యలు మానభంగాలు వంటి సంఘటనలు స్థానిక పోలీసులు, ఆర్మీ పాల్పడింది.

* ఖాసీం రజ్వీ స్వస్థలమైన లాథూర్లో 20 రోజుల పాటు దాడులు కొనసాగాయి.

* ఈ ఆకృత్యాలకు పాల్పడిన సైన్యానికి నాయకత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరిని ఎక్కడ శిక్షించాల్సి వస్తుందని, మత ఘర్షణలు చెలరేగుతాయని పండిట్ నెహ్రు, పటేల్ ఈ నివేదికను బహిర్గత పర్చలేదు.

* 2013 సం॥ లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం సుందర్లాల కమిటీ నివేదికను ఢిల్లీలోని నెహ్రు మెమోరియల్ మ్యూజియం లైబ్రరీలో అందుబాటులోకి తెచ్చింది.

 *ఈ కమిటీ నివేదిక ఆధారంగా జె. ఎన్. చౌదరిని తొలగించి ఆయన స్థానంలో ఎం.కె. వెల్లోడిని నియమించింది.

3. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ :

* ముల్కిఉద్యమం సందర్భంగా సిటీ కాలేజ్ మరణకాండపై నియమించబడిన కమిటీ.

* 1952 సెప్టెంబర్ 9న కమిటీ నియమించబడినది.

* నివేదికను డిసెంబర్ 28 1952 సమర్పించింది.

కమిటీ విచారణకు హాజరైన ప్రముఖులు....

1) బూర్గుల రామకృష్ణారావు- హైద్రాబాద్ సి. ఎం.

2) మేనప్ప - ఐకీపీ 

3) శివకుమార్ లాల్ పోలీస్ కమిషనర్

4) సుందరం పిళ్ళై - అసిస్టెంట్ పోలీస్ కమిషనర్

5) శ్రీరాంలాల్ - సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్

6) హయగ్రీవాచారి - కాంగ్రెస్ నాయకులు (తెలంగాణ ప్రదేశ్)

* పింగళి జగన్మోహన్రెడ్డికి సహకరించిన అడ్వకేట్ రాజారాం అయ్యార్

నివేదికలోని అంశాలు :

* పోలీస్ ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి పోలీసుల మధ్య సమన్వయం కొరవడింది. విద్యార్థులు పోలీసులపై రాళ్ళు రువ్వినారు. ఇది పోలీసుల క్రమశిక్షణ రాహిత్యం.

*1952 సెప్టెంబర్ 3, 4 ఉద్రిక్తలకు కొందరు ప్రజా నాయకులు కూడా కారణం ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. నిరసన తెలియజేశారు. ఇలాంటి సమయంలో కొందరు నాయకులు విధుల్లోకి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు ఇచ్చారు. పరిస్థితి విషమించడానికి ప్రజా నాయకులు కొంత వరకు కారణం.

*రెండోసారి పోలీసుల కాల్పులు 1952 సెప్టెంబర్ 4న జరిగాయి. రెండోసారి కాల్పులు జరుపవలసిన అవసరం లేదు. పోలీసులు సమన్వయం పాటించలేదు.

* 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో విద్యార్థుల కంటే ప్రజలే అధికంగా పాల్గొన్నారు. ఆందోళన కారులు పోలీసులపై రాళ్ళు విసిరారు. వైర్లెస్ వ్యాన్లను తగులబెట్టారు. పోలీసుల కాల్పులు సమర్ధనీయమే.

* నాన్ ముల్కి సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణం 1952 ఆగస్టు కంటే ముందే కమిటీ నియమించాల్సి ఉండాల్సింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శాంతి భద్రతలను విఘాతం కలిగినది.

4) ఎస్.కె. థార్ కమిషన్:- 

* ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిషన్.

* కమిటీ చైర్మన్ : ఎస్.కె. థార్ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి

కమిటీ సభ్యులు :

1) డా॥ పన్నాలాల్

2) జగత్ నారాయణలాల్

* ఈ కమిటీని - భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు సాధ్యమో కాదో పరిశీలించాలని "భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది.

* ప్రస్తుత పరిస్థితుల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదని సృష్టం చేసింది. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే

1) భౌగోళిక అవిచ్ఛన్నత

2) ఆర్ధిక స్వయం సమృద్ధి

3) పరిపాలన సౌలభ్యం

4) భవిష్యత్ అభివృద్ధి సామర్థ్యం

5) అత్యధిక ప్రజల ఆమోదం ఉండాలని పేర్కొంది.

* ఈ కమిషన్ ను - 1948 జూన్ 17 ఏర్పాటుఏ చేయగా 1948 డిసెంబర్ 13న నివేదికను సమర్పించింది.

5) జె.వి.పి,. కమిటీ : 

* ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై నియమించబడిన రాజకీయ కమిటీ

* ఎస్.కె. థార్ కమిషన్ నివేదికపై కలత చెందిన ఆంధ్రనాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 1948 డిసెంబర్ 18న జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ కమిటీని నియమించారు.

* 1949 ఏప్రిల్ 5న కమిటీ రిపోర్టు ఇచ్చినది.

కమిటీలోని సభ్యులు :

1) జవహర్ లాల్ నెహ్రు ప్రధాని

2) వల్లభాయి పటేల్ ఉప ప్రధాని

3) పట్టాభి సీతారామయ్య - ఎఐసిసి అధ్యక్షులు

* భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని సంఘం అభిప్రాయ పడింది. కాని ఆంధ్రరాష్ట్ర విషయంలో మాత్రం సడలింపు ఇచ్చింది. కాని మద్రాసు నగరాన్ని ఆంధ్రులు వదులుకుంటే అది సాధ్యమవుతుందని చెప్పింది.

* మద్రాసు నగరాన్ని వదులు కోవడానికి ఆంధ్రులు ఇష్టపడక పోవడం, ముఖ్యమంత్రి విషయంలో రావడంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయింది.

6) కైలాసనాథ్ వాంఛూకమిటీ : 

* ఆంధ్రరాష్ట్రం విభజన సమస్యల పరిష్కారానికి నియమించబడిన కమిటీ.

* ఈ కమిటీ 1953 జనవరిలో నియమించగా 1953 ఫ్రిబవరి 7న నివేదికను హోంశాఖకు అందజేసింది.

* కైలాసనాథ్ వాంఛూ రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్నారు.

నివేదికలోని అంశాలు :

* మద్రాసు ఉమ్మడి రాజధానిగా 4 సంవత్సరాలు ఉండాలని కమిటీ సూచించినది.

నివేదిక ప్రకారం - ఆంధ్రప్రాంతంలోని 7 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబర్ 1 ఏర్పడింది.

7. సయ్యద్ ఫజల్ అలీ కమిషన్: 

రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ (స్టేట్ రీ-ఆర్గనైజేషన్ కమీషన్)

◆ కమిషన్ ఛైర్మన్ సయ్యద్ ఫజల్ అలీ (ఒరిస్సా గవర్నర్)

సభ్యులు : 1) హృదయానాథ్ కుంజ్రు - కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడు

2) కవలం మాధవ ఫణిక్కర్ ఈజిప్టులో భారత రాయభారి.

* కమిటీని 1953 డిసెంబర్ 29న నియమించగా, కమిటీ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న నివేదికను కేంద్రానికి సమర్పించినది.

* కమిషను 1,52,250 విజ్ఞప్తులు రాగా -పరిశీలించదగినవి 2 వేలలోపు ఉన్నట్లు కమిషన్ గుర్తించినది.

* కమిషన్ మొత్తం 38000 మైళ్ళు, 104 ప్రదేశాలను సందర్శించినది 9 వేల మందిని ఇంటర్వ్యూ చేసినది.

* కమిటీ - 1954 జూలై 19 కరీంనగర్, వరంగల్ జిల్లాలో పర్యటించినది.

* వరంగల్ లో ఉపాధ్యాయ పక్ష నాయకుడు ఆనందరావుతోట, విద్యార్థిగా ఉన్న ప్రొ॥ జయశంకర్ సార్ కలిసి "తెలంగాణ రాష్ట్రాన్ని" ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చిరు.

* కాళోజీ, హయగ్రీవాచారి, బండారు చంద్రమౌళీశ్వర రావు లాంటి తెలంగాణ వ్యక్తులు విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇచ్చారు.

నివేదికలోని అంశాలు :

* హైదరాబాద్, విదర్భలతో పాటు మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

* 5వ చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి, 6వ చాప్టర్ లో ఆంధ్ర రాష్ట్రం వాదనల గురించి వివరించారు.

* ఫెరా 369 నుంచి 389 వరకు హైద్రాబాద్, ఆంధ్ర రాష్ట్ర వాదనలు పొందు పర్చారు.

* ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రాన్ని కొనసాగించాలని 1961లో హైద్రాబాద్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ద్వారా, 2/3 వంతు సభ్యులు ఆమోదిస్తే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేయాలని సూచించింది.

* హైదరాబాద్ను విడదీసి ఆంధ్రలో కలపడాన్ని వ్యతిరేకించింది.

* మరాఠి భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్నాటకలో కలపాలని సూచించింది.

* తెలుగు మాట్లాడే బీదర్ ప్రాంతంతో సహ 10 జిల్లాలతో కూడిన హైదారబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయానలి సూచించింది.

8) కుమార్ లలిత్ కమిటీ : 

* 1969 జనవరి 19న జరిగిన అఖిలపక్షం తీర్మానం మేరకు - తెలంగాణ మిగులు నిధులు లెక్క తీయడానికి ఏర్పాటు చేసిన కమిటీ

* ఈ కమిటీని 1969 జనవరి 23 కాగ్ అధికారి అయిన కుమార్ లలిత్ను నియమించడం జరిగింది. 1969 మార్చి 14న కమిటీ నివేదికను సమర్పించింది.

* ఈ కమిటీ ప్రకారం తెలంగాణ మిగులు నిధులు 34.10 కోట్ల రూ॥

* ఈ కమిటీ 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు ఏ.పీ. లో ఖర్చు పెట్టిన లెక్కలను పరిశీలిచింది.

* కానీ తెలంగాణ ప్రాంతీయ సంఘం తెలంగాణ ప్రాంత మిగులు నిధులు 107.13 కోట్ల రూ॥ అని ఆరోపించింది.

9.వశిష్ఠ భార్గవ కమిటీ : 

8 సూత్రాల పథకం ప్రకారం తెలంగాణ ప్రాంత మిగులు నిధులను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ.

కమిటీ అధ్యక్షుడు : వశిష్ఠ భార్గవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

కమిటీలోని సభ్యులు :

1) ప్రొ. మకుట్ నిహరీ మదూర్ ఆసియా విద్యా సంస్థల డైరెక్టర్

2) హరిభూషణ్ బార్- అసిస్టెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కమిటీ కార్యదర్శి : టి. కృష్ణ స్వామి

* 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు మిగులు నిధులను అధ్యయనం చేసినది.

* ఈ కమిటీని 1969 ఏప్రిల్ 23న 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు.

* కమిటీ నివేదికను 1970 ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

* కమిటీ నివేదిక ప్రకారం మిగులు నిధులు 28.34 కోట్ల రూ.

* కేంద్ర ప్రభుత్వం 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ.45 కోట్లు కేటాయించడంతో ఈ మిగులు నిధులు పంచాయతీ ముగిసిపోయింది.

10) కైలాస్ నాథ్ వాంఛూ కమిటీ:

 జి.ఓ. 36 వివాదం నేపథ్యంలో ముల్కి నిబంధనలను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ ఈ కమిటీ 1969 ఏప్రిల్ 19న ఏర్పాటు చేశారు.

కమిటీ చైర్మన్ : కె. ఎన్. వాంఛూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

సభ్యులు :

1) ఎం.సి. సెతాల్వాడ్ మాజీ అటార్ని జనరల్

2) నిరేన్ డే ఆనాటి అటార్నీ జనరల్

నివేదికలోని అంశాలు :

* కమిటీ నివేదికను 1969 సెప్టెంబర్ 7న 31 పేజీల నివేదికను అందజేసింది.

* ఈ కమిటీ ముల్కి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నది.

* ముల్కి నిబంధనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలో 16(3) ను సవరణ చేయాలని, అది సవరణ చేస్తే ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ముల్కి నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.

11) జయభారత్ రెడ్డి కమిటీ:

 6 సూత్రాల పథకం, రాష్ట్ర పతి ఉత్తర్వుల విరుద్ధంగా ఉద్యోగాల ఉల్లంఘన పై నియమించబడిన కమిటీ.

* 1984లో తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు స్వామినాథన్ ఫిర్యాదు మేరకు నాన్ ముల్కి ఉద్యోగుల లెక్కలు తీయడానికి ఎన్.టి.ఆర్. ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

కమిటీ చైర్మన్ : జయభారత్రెడ్డి

కమిటి సభ్యులు :

1) కమలనాథ్

2) ఉమాపతి

* ముగ్గురు ఐఎఎస్ ఆఫీసర్లు అయిన కారణంగా ఈ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అని పిలిచారు.

* ఈ కమిటీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 58,962 మంది తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ఉద్యోగాలు పొందారని పేర్కొంటూ 36 పేజీల నివేదికను ఇచ్చినది.

* 1975 అక్టోబర్ 18 నుంచి 1981 జూన్ 30 వరకు ఉద్యోగాల అక్రమాలు వివరాలు అందించింది.

* జిల్లాల వారీగా అక్రమ ఉద్యోగాలు....

1) మహబూబ్నగర్ 1489

2) ranga reddy - 2103

3) Hyderabad - 22,722

4) medhak - 1424

5) నిజామాబాద్ - 4286

6) అదిలాబాద్ 5099

7) karimnagar - 4638

8) warangal - 3, 141

9) khammam  10, 353

10) nalgonda - 3,707

* జయ భారత్రెడ్డి కమిటీ సిఫారసులు అమలు చేయకుండా ప్రభుత్వం పెద్దలు అడ్డుకున్నారు.

12) సుందరేషన్ కమిటీ:

 ఆఫీసర్స్ కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ ఈ కమిటీ 1985 లో నివేదికను సమర్పించింది.

* జయ భారత్ రెడ్డి, సుందరేషన్ కమిటీల సిఫారసుల మేరకు ఎన్.టి.ఆర్. ప్రభుత్వం 1985 డిసెంబర్ 30న 610 జి.వో ను జారీచేసింది.

* ఈ జీ.వో. లో నిబంధనలను విరుద్ధంగా ఉన్న ఉద్యోగులను 1986 మార్చి 31 లోగా వెనక్కి పంపాలని జి.వో. లోనే పేర్కొనడం జరిగింది. కానీ 610 జీ.వో. 2014 జూన్ 2 వరకు కూడా అమలుకు నోచుకోలేదు.

13) గిరిగ్లాని కమిటీ : 

610 జివో. ఉత్తర్వులలో జరిగిన అవకతవకలపై అధ్యయనం చేయడానికి నియమించబడిన ఏక సభ్య కమిషన్.

* ఈ కమిషను చంద్రబాబు ప్రభుత్వం 2001 జూన్ 25 ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదిక -2001 అక్టోబర్ 6న అందజేసిన పూర్తిస్థాయి నివేదికను 2004 సెప్టెంబర్ 30న అందజేసింది.

* జెటో మంగల్స్ గిర్ గ్లాని మొత్తం 705 పేజీల నివేదికను అందజేశాడు.

* మొత్తం నివేదికను 3 భాగాలుగా చేసి అందజేసింది.


వ్యాల్యుమ్ 1 : 1975 - 2004 మధ్య ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసింది.

వ్యాల్యుమ్ - 2 : గిరిగ్లాని సేకరించిన సమాచారాన్ని అనుబంధాల రూపంలో అందజేసింది.

వ్యాల్యుమ్ -3 : పరిష్కార మార్గాలను సూచించింది.

* 126 పద్ధతుల్లో ఉల్లంఘనలు జరిగాయని, వాటిని 18 రకాలుగా గుర్తించి 35 పరిష్కార మార్గాలు సూచించింది.


14) రేవూరి ప్రకాశ్ రెడ్డి హౌస్ కమిటీ: 

* గిర్లోని ప్రాథమిక నివేదికపై 610 జి.వో. అమలుపై నియమించిన శాసనసభ కమిటీ

* ఈ కమిటీని 18 ఎమ్మెల్యేలతో రేవూరి ప్రకాశ్ రెడ్డి చైర్మన్ గా 2001 డిసెంబర్ 29న నియమించింది.

* ఈ కమిటీ మొదటి నివేదికలో 2003 మార్చి 17న రెండో నివేదికను 2003 నవంబర్ 14న సమర్పించినది.

* ఈ కమిటీ నివేదికలా 563 సివిల్ ఎస్ఐలలో 273- మంది 97 రిజర్వ్ ఎస్బలలో 44 మంది స్థానికేతరులు ఉన్నట్లు పేర్కొంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ కమిటీ : 2006

* 610 జీ.వో. గిరిగ్లాని కమిటీ సిఫారస్సుల అమలుకు 2006 డిసెంబర్ 26న ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో హౌస్ కమిటీని వై.ఎస్. ప్రభుత్వం నియమించింది.

కాంగ్రెస్ నుంచి కమిటీలోని సభ్యులు....

1) బసవరాజు సారయ్య

2) ఎస్. శైలజనాథ్

3) సునీతా లక్ష్మారెడ్డి

4) బాజిరెడ్డి గోవర్ధన్

5) దార సాంబయ్య

6) గాదె వెంకట్రెడ్డి

టిడిపి నుంచి : టి. దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు, డి.సి. గోవిందరెడ్డి

సిపిఎం నుంచి : జూలకంటి రంగారెడ్డి

సిపిఐ నుంచి : చాడ వెంకట్రెడ్డి

టి.ఆర్.ఎస్.: నుంచి - టి. హరీష్ రావు

ఎం.ఐ.ఎం. నుంచి అక్బరొద్దీన్ ఓవైసీ లను నియమించింది.

* గాదె వెంకట్రెడ్డి లాంటి నాయకులు వివాదం సృష్టించడంతో మధ్యలోనే ఆగిపోయింది

* 610 జి.వో. అమలు కోసం - దేవదాయ శాఖమంత్రి సత్యనారాయణ (గ్రామీణ అభివృద్ధి శాఖమంత్రి) - డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాబినెట్ కమిటీలు వేసిన ఆ నివేదికలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.


15. తార్కుండే కమిటీ : 

బూటకపు ఎన్కౌంటర్ల పై విచారణ జరపడానికి జలగం వెంగళ్ రావు కాలంలో 1977 లో ఈ కమిటీ నియమించబడింది. (కేంద్ర హోం మంత్రి చరణ్ సింగ్)

దీనిలోని సభ్యులు : కన్నా బిరాం హైకోర్టు న్యాయవాది / అరుణ్ శౌరి ఎడిటర్: (ఇండియన్ ఎక్స్ ప్రెస్) / నబకృష్ణ చౌదరి - ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి / టిజి, వర్గిస్ హిందుస్తాన్ టైమ్స్ - కాళోజీ ప్రొ|| బల్వంతరెడ్డి,ఎం.వి. రామమూర్తి, కె. ప్రతాప్రెడ్డి మొ|| వారు సభ్యులు బూటకపు ఎన్ కౌంటర్ లలో 77 మంది చంపడ్డారని పేర్కొంది.


16.భార్గవ్ కమిషన్ : 

1977 లో వెంగళరావు నియమించిన మరో కమీషన్ ఈ కమీషన్ ముందు తార్కుండే తాను సేకరించిన సమాచారాన్ని కమిటీ ముందు ఉంచారు.

* భార్గవ కమిషన్ 1968 నుంచి 1977 మధ్య 250 మంది మరణంచారని పేర్కొంది.

* భార్గవ కమిషన్ ముందు గిరాయిపల్లి ఎన్కౌంటర్లో నలుగురు యువకులను కాల్చి చంపారని కన్నాభిరావ్ ఆధారాలతో సహ నిరూపించారు.

* ఈ నివేదిక వెల్లడైతే పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందని అధికారులంతా ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేత నివేదికను ఆపించారు.


17. టి.ఎల్.ఎన్. రెడ్డి కమిషన్: 

అదృశ్యమైన నక్సలైట్లపై విచారణ జరుపుటకు మర్రి చెన్నారెడ్డి కాలంలో(1989) - 90 నియమించాబడిన కమిటీ.


18. హైమన్ డార్ప్ కమిటీ :

 కొమరం భీం అమరత్వం అనంతరం గోండుల సమస్యలు, ఆదివాసుల సమస్యలను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ ఇది. ఈ కమిటీ తీర్పు మేరకు 1949 లో ఆదివాసి ప్రాంతాల క్రమబద్ధీకరణ, నోటి ఫైడ్ ట్రైబల్ ఏరియా రూల్స్ ఏర్పడినాయి.

* ఈ కమిటీ సూచనల మేరకే గిరిజనులపై దాడులు, కబ్జాల నుంచి రక్షణ, ట్రైబల్ ఏరియాలో భూమి తగదాలు, రెవెన్యూ అధికారులు జోక్యాన్ని నిరసించింది.

హైమన్ డార్ప్: Tribal of India, The Struggle for Survival అనే గ్రంధాలు రసారు.

* ఈ కమిటీ సూచన మేరకే 1946 లో నిజాం ప్రభుత్వం సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్ను నెలకోల్పింది. ట్రైబల్ ఆఫ్ దెక్కన్ - హైమన్ డార్ఫ్

19. విద్యుత్ సంస్కరణలపై హితభన్య్య కమిటీ :

విద్యుత్చ్ఛక్తి రంగానికి సంబంధించి మార్పులు సూచించడానికి నియమించబడిన కమిటీ హీతన్ భయ్యా కమిటీ ఈ కమిటీ - APSEB ను ప్రయివేట్ పరం చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ పంపిణీ రంగాలుగా వేరు చేయలని సూచించింది.

* ఈ కమిటీ సూచనల మేరకు 1998, ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణ చట్టం 1998 2 అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

* 1999 మార్చిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషను నెలకొల్పారు.


20. రాష్ట్ర పరిపాలన - జీతాలపై గంగోపాధ్యాయకమిటీ :

* ప్రభుత్వ పరిపాలన జీతాల పై అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ గంగోపాధ్యాయ కమిటీ ప్రభుత్వ ఉద్యోగులను, వ్యయం తగ్గించాలని ఈ కమిటీ సూచించింది.

* అనుమతి లేకుండా కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి వీలు లేదని చట్టం చేయడమైంది. 1996-97 నుంచి సాలినా 0.9% ఉద్యోగులకు ఉధ్వంసన పలకాలని సూచించింది. నీటి పారుదల శాఖలో 40% ఉద్యోగులు అనవసరంగా ఉన్నారని పేర్కొంది.

* 1996-97కి ముందు, ప్రతి సం||రం,- 3.4% ఉద్యోగులు పెరగగా, 1996-97 సంస్కరణ తర్వాత 1% కన్నా తక్కువయ్యాయి.

* దీని కారణంగా - 2000 01 రాష్ట్రం రెవెన్యూ వ్యయం 68.17% గా ఉన్నా జీతాలు, పెన్షన్లు - 2002-03 నాటికి 62.18% తగ్గించారు.


21. ఉన్నత విద్యపై కోనేరు రామకృష్ణరావు కమిటీ :

ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ పాలన అవసరం లేదని నాణ్యమైన విద్యునున ప్రయివేటు సంస్థలు, అందిస్తాయని కొనుక్కోగలిగే వారికే అందే మార్కెట్గా ఉన్నత విద్య ఉండాలని కోనేరు రామకృష్ణారావు కమిటీ శ్వేత పత్రాన్ని సమర్పించింది.


22. ప్రభుత్వ రంగ పరిశ్రమలపై సుబ్రమణ్యం కమిటీ :

* ఖాయిల పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూత, కొన్ని పరిశ్రమల ప్రయివేటీకరణపై నియమించబడిన కమిటీ సుబ్రమణ్యం కమిటీ ఈ కమిటీ సూచనల మేరకు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడ్డాయి. ఎంతో మంది ఉద్యోగులు వి.ఆర్.ఎస్. తీసుకొని ఉద్యోగాలకు దూరమయ్యారు.

ఉదా॥ అల్విన్ కంపెనీ, బోధన్ షుగర్స్, పాలేరు సహకార చక్కరమిల్లు అదిలాబాద్ సహకార స్పిన్నింగ్ మిల్లు, నిజాం షుగర్స్ - మిర్యాలగూడ జహీరాబాద్, ముంబోజుపల్లి

* 1998 - 2001 మధ్య 13,321 మంది వి.ఆర్.ఎస్. ద్వారా ఉద్యోగులు పోగోట్టుకున్నారు.

* 2003లో 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో 21,392 మందికి వి.ఆర్.ఎస్. ఇచ్చి రూ॥30.55 కోట్లు చెల్లించారు.


23. జయతీ ఘోష్ కమిటీ:

రైతు ఆత్మహత్యలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ "జయతీ ఘోష్” కమిటీ

24. కొనేరు రంగారావు కమిటీ: 

ప్రభుత్వం భూ సమస్యలు, భూ పంపిణీ, ఆదివాసుల భూ సమస్య 1/70 గిరిజన భూ చట్టం ఉల్లంఘనలు, తదితరాలను అధ్యయనం చేయడానికి చేసిన కమిటీ - కోనేరు రంగారారావు కమిటీ

25. ప్రణబ్ ముఖర్జి కమిటీ : 

2005 జనవరి 8 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయాలు, సంప్రదింపులకు ఏర్పాటు చేసిన కమిటీ ఇది. ప్రణబ్ ముఖర్జి కమిటీ అధ్యక్షుడు

కమిటీలో సభ్యులు : డిఎంకె పార్టీకి చెందిన మంత్రి దయానిదిమారన్ రాష్ట్రీయ జనతాదలకు సంబంధించిన మంత్రి రఘువంశ్ ప్రసాద్్సంగ్, కమిటీలో సభ్యులు నోటిఫికేషన్లో 8 వారాల్లో ఈ కమిటీ రిపోర్టు ఇస్తుందని ప్రకటించింది.

* ప్రణబ్ ముఖర్జీ కమిటీకి దేశంలోని 36 పార్టీలు మద్దతు తెలుపుతున్నట్లు లేఖలు అందించాయి.

* 36 పార్టీలే కాక మాజీ ప్రధానులు, వి.పి.సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ ఎం.కె. గుజ్రాల్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిచ్చారు.


26. రోషయ్య కమిటీ : 

తెలంగాణపై అధ్యయనం చేయడానికి వై.ఎస్. ప్రభుత్వం 2009, ఫిబ్రవరి 12న రోషయ్య అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గరు ఆంధ్ర ఎమ్మెల్యేలు, 4గురు తెలంగాణ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది.

కమిటీలోని సభ్యులు - 7

1. కొణతాల రామకృష్ణ

2. షేక్ హుస్సేన్

3. పద్మరాజు

4. జె. గీతారెడ్డి

5. ఉత్తమ్ కుమార్ రెడ్డి

6. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

7. అక్బరుద్దీన్ ఓవైసీ

* కమిటీని ఏర్పాటు చేసినప్పటికి ఆ కమిటీ రిపోర్టు మాత్రం ఎవరికి తెలియదు. ఆ కమిటీ మధ్యలోనే ఆగిపోయింది.


27. శ్రీ కృష్ణ కమిటీ - 2010 ఫిబ్రవరి 3న :

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితిపై సంప్రదింపులు జరపడానికి 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించడం జరిగింది.

* శ్రీకృష్ణ కమిటీలోని సభ్యుల సంఖ్య 4+1?

సభ్యులు : 1) వినోద్ కుమార్ దుగ్గల్, (సభ్య కార్యదర్శి)

2) రవీందర్ కౌర్ (ఢిల్లీ ఐఐటీ లో హ్యుమనీటిస్, సోషల్ సైన్స్)

3) రణబీర్ సింగ్ - నల్సార్ యూనివర్సిటీ వ్యవస్థాపక డైరెక్టర్

4) అబూసలే (సీనియర్ రీసెర్చ్ ఫెలో షరిఫ్ (ఆర్థికవేత్త)


28.ఎ.కె. ఆంటోని కమిటీ : 

* 2013, ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన అమలు చేయడానికి నియమించడం జరిగింది.

* సి. డబ్ల్యు.సి. ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యోగ సంఘాలు నెలరోజులు పాటు సమ్మెను నిర్వహించడంలో కేంద్ర రక్షణ మంత్రి అయిన ఎ.కె. ఆంటోని అధ్యక్షతన 2013 ఆగస్టు 6న కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

కమిటీలోని సభ్యులు...

-దిగ్విజయ్ సింగ్

-వీరప్ప మొయిలీ

- అహ్మద్ పటేల్


29.జి.ఓ.ఎమ్ ఏర్పాటు :

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పడిన వ్యవస్థ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్

* దీనిని 2013 అక్టోబర్ 8న ఏర్పాటు చేయడం జరిగింది.

* జి.ఓ.ఎమ్ చైర్మన్ ఎ.కె. ఆంటోని రక్షణ శాఖ మంత్రి


కమిటీలోని సభ్యులు....

1. సుశీల్ కుమార్ షిండే (హోంశాఖమంత్రి)

2. చిదంబరం (ఆర్థిక శాఖమంత్రి)

3.వీరప్ప మొయిలీ (పెట్రోల్ శాఖ మంత్రి)

4. జయరాం రమేష్ (గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి)

5. గులాంనబీ ఆజాద్ (కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి) జి .ఓ.ఎమ్ ప్రత్యేక ఆహ్వానితుడు వి. నారాయణ స్వామి (సిబ్బంది వ్యవహారాలు ప్రధాని కార్యాలయం)


30 సచార్ కమిటీ : రాజేంద్రసింగ్ సచార్ కమిటీ

* ఈ కమిటీని మార్చ్ 9, 2005న ఏర్పాటు చేశారు.

* కమిటీ సిఫారస్సులను 2007 మే 17న కేంద్రం ఆమోదించింది.

నివేదిక : మతపరమైన మైనార్టీల సమస్యల నివారణకు అవకాశాలు కల్పించాలి.

* అర్జాల్ తరగతి ముస్లింలకు ఎస్.సి. జాబితాలు చేర్చాలి

* అజ్లాఫ్ తరగతి ముస్లింలకు -బి సి. జాబితాలో చేర్చాలి

* ప్రాథమిక విద్యను - ఉర్దూలో బోధించాలి.

* ఉపాధ్యాయులకు ముస్లిం సంస్కృతిపై అవగాహన కల్పించాలి

* ముస్లింల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం ప్రవేశట్టారు.


31 ఉషామెహ్ర కమిటీ :

 2007 మే 19న ఎస్సీ వర్గీకరణపై నియమించబడిన కమిటీ


Top

Below Post Ad