Hot Widget

Type Here to Get Search Results !

ఇండియా GK bits... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. అక్టోబర్ 31 న ఏ దేశంలో నడిచే తేజ్ గ్రామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో సిలిండర్ పేలి 74 మంది సజీవదహనం అయ్యారు ? జవాబు. 2

1 ) భారత్ 

2 ) పాకిస్థాన్ 

3 ) బంగ్లాదేశ్ 

4 ) నేపాల్ 


2. అమెరికాలో అత్యధికంగా భారతీయులు మాట్లాడే భాష హిందీ . రెండో స్థానంలో గుజరాతీ ఉన్నది . ఏ భాష మాట్లాడే వారు మూడో స్థానంలో ఉన్నారు ? జవాబు. 4

1 ) తమిళం 

2 ) కన్నడం 

3 ) మలయాళం 

4 ) తెలుగు 


3. 2020 టోక్యో ఒలింపిక్స్ కు 10 మంది అంబాసిడర్లను నియ మించారు . అందులో ఆసియా నుంచి అంబాసిడర్‌గా నియ మితులైనది ఎవరు ? జవాబు. 3

1 ) చెలాంగ్

2 ) నవోమి ఒసాకా

3 ) మేరీకోమ్ 

4 ) లిన్ 


4. అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టుబెట్టడంతో నవంబర్ 1 న ISIS నూతన చీఫ్ అబు ఇబ్రహీం అల్ హస్మీ ఎన్నిక య్యాడు . అతడు ఏదేశానికి చెందినవాడు ? జవాబు. 1

1 ) ఇరాక్ 

2 ) ఇరాన్ 

3 ) సిరియా 

4 ) ఏదీకాదు 


5. మహా తుఫాన్ కింది వాటిలో ఏ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నది ? జవాబు. 4

1 ) తెలంగాణ 

2 ) ఆంధ్రప్రదేశ్ 

3 ) తమిళనాడు 

4 ) గోవా 


6. గత మూడేండ్లలో దేశంలో పెరిగిన నిరుద్యోగుల శాతం ? జవాబు. 1

1 ) 5.5 శాతం 

2 ) 5.6 శాతం 

3 ) 5.1 శాతం

 4 ) 5.4 శాతం 


7. జర్మనీ chancellor ఏంజెలా మెర్కెల్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు భారత్ లో పర్యటించారు . ఆమె భారత్ తో మొత్తం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు ? జవాబు. 1

1 ) 17 

2 ) 15 

3 ) 16 

4 ) 18 


8. ఏదేశం 2022 నాటికి నవ భారత నిర్మాణంలో సహకారం అందించడానికి అంగీకరించింది ? జవాబు.3 

1 ) అమెరికా 

2 ) ఫ్రాన్స్

3 ) జర్మనీ

4 ) రష్యా   


9. దేశంలోని ఏ నగరంలో నవంబర్ 1 నుంచి వారంపాటు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ? జవాబు. 2

1 ) మైసూర్ 

2 ) ఢిల్లీ 

3 ) కాన్పూర్ 

4 ) బెంగళూరు 


10. నవంబర్ 1 న ఎక్కడ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించారు ? జవాబు. 3

1 ) కోహెడ 

2 ) రావిర్యాల

 3 ) దండుమల్కాపూర్ 

4 ) ఆదిభట్ల 


11. జార్ఖండ్ 2000 , నవంబర్ 15 న నూతన రాష్ట్రంగా అవతరించింది . ఈ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ? జవాబు. 1

1 ) 81 

2 ) 82 

3 ) 90 

4 ) 70 


12. 2019 నవంబర్ 30 నుంచి జార్ఖండ్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించనున్నారు . మొత్తం ఎన్ని విడుతల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి ? జవాబు. 3

1 ) 3 

2 ) 4 

3 ) 5 

4 ) 6 


13. నవంబర్ 1 న షాంఘై సహకార సంస్థ ప్రత్యేక సమావేశాలను ఎక్కడ నిర్వహించారు ? జవాబు. 2

1 ) అల్మటు 

2 ) తాష్కెంట్ 

3 ) బీజింగ్ 

4 ) హాంకాంగ్ 


14. ప్రపంచంలో తొలిసారి 5 జీ టెక్నాలజీని ఎక్కడ ప్రారంభించారు ? జవాబు. 2

1 ) చైనా 

2 ) దక్షిణకొరియా 

3 ) అమెరికా 

4 ) ఫ్రాన్స్ 


15. ఏదేశంలోని నిర్మాణరంగంపై అమెరికా ఆంక్షలు విధించింది ? జవాబు. 1

1 ) ఇరాన్ 

2 ) ఇరాక్ 

3 ) సిరియా 

4 ) చైనా 


16. ఆండ్రెజ్ ఫైంకోవిచ్ ఏ దేశ ప్రధాని ? జవాబు. 2

1 ) రుమేనియా 

2 ) క్రొయేషియా 

3 ) ఫ్రాన్స్

4 ) ఏదీకాదు 


17. కింది వారిలో ఎవరు ' బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ ' స్పీకర్ పదవికి రాజీనామా చేశారు ? జవాబు. 2

1 ) డేవిడ్ మేయర్ 

2 ) జాన్ బెర్కో 

3 ) అంటోనిమల్లిస్ 

4 ) ఏదీకాదు 


18. నవంబర్ 1 న మెల్ బోర్న్ లో టీ -20 క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించిన బాలీవుడ్ నటి ఎవరు ? జవాబు. 2

 1 ) ఐశ్వర్యారాయ్ 

2 ) కరీనాకపూర్ 

3 ) సోనమ్ కపూర్ 

4 ) కత్రినాకైఫ్ 


19. కేంద్రం ఏ సంవత్సరం నుంచి అక్టోబర్ 31 ని ' జాతీయ ఐక్యతా దినంగా ప్రకటించింది ? జవాబు. 2

1 ) 2016 

2 ) 2015 

3 ) 2017 

4 ) 2018 


20. అక్టోబర్ 28 నుంచి 31 వరకు ఎక్కడ చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించారు ? జవాబు. 1

1 ) బీజింగ్ 

2 ) షాంఘై 

3 ) హజింటా 

4 ) వుహాన్ 

Top Post Ad

Below Post Ad