Hot Widget

Type Here to Get Search Results !

మానవ శరీరం బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. కిందివాటిలో అంతఃస్రావ్య గ్రంథుల స్థకు సంబంధించి సరైనవి ఏవి ? 

i ) అంతఃస్రావ్య గ్రంధులు స్రవించిన రసా యన పదార్థాలను హార్మోన్లు అంటారు . 

ii ) అంతఃస్రావ్య గ్రంథులు స్రవించిన పదార్థాలు రక్తం ద్వారా ఆయా విధులు నిర్వహించే కణాలకు రవాణా అవుతాయి . 

iii ) ఇవి వివిధ జీవక్రియలను ప్రభావితం చేస్తాయి .

 iv ) వీటి ప్రభావం సాధారణంగా సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది . 

1 ) i , ii , iii 2 ) ii , iii , iv 3 ) i , iii , iv 4 ) i , ii , iii , iv


 2. గొంతు కింద అమరి ఉండి ' ఆడమ్స్ ఆపిల్ గా కనిపించే గ్రంథి ఏది ? 

1 ) పిట్యూటరీ గ్రంథి 

2 ) పీనియల్ గ్రంధి 

3 ) థైరాయిడ్ లేదా అవటు గ్రంధి 

4 ) హైపోథలామస్ 


3. మూత్రపిండాలకు పైభాగంలో అమరి ఉండే గ్రంధి ఏది ? 

1 ) పిట్యూటరీ 

2 ) అడ్రినల్ 

3 ) క్లోమం 

4 ) అండాలు 


4. క్లోమంలో ఏ రకం కణాలు ఇన్సులిన్ హార్మోనను స్రవిస్తాయి ? 

1 ) ఆల్ఫా లేదా ' A ' కణాలు 

2 ) బీటా లేదా ' B కణాలు 

3 ) డెల్టా లేదా ' D ' కణాలు 

4 ) ఎప్సిలాన్ కణాలు 


5. ఇన్సులిన్ హార్మోన్ ప్రధాన విధి ఏమిటి ? 

1 ) రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది . 

2 ) రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది . 

3 ) రక్తంలో గ్లూకగాన్ స్థాయిని తగ్గిస్తుంది . 

4 ) రక్తంలో గ్లూకగాన్ స్థాయిని పెంచుతుంది . 


6. శరీరంలో దైనందిన దినచర్యను ( సర్కేడి యన్ రిథమ్ ) నియంత్రించే అంతఃస్రావ్య గ్రంథి ఏది ? 

1 ) జైమస్ గ్రంథి 

2 ) పీనియల్ గ్రంథి 

3 ) పారాథైరాయిడ్ గ్రంధి 

4 ) పిట్యూటరీ గ్రంది


7. కిందివాటిలో అంతఃస్రావ్య గ్రంధి కానిది ఏది ? 

1 ) క్లోమం 

2 ) ముష్కాలు 

3 ) లాలాజల గ్రంథులు 

4 ) పార్శ్వ అవటు గ్రంథి 


8. కిందివాటిలో హైపోథలామస్ నిర్వహించే విధులు ఏవి ? 

i ) హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది . 

ii ) శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది . 

iii ) జల సమతౌల్యతను ప్రభావితం చేస్తుంది . 

iv ) FSH హార్మోను స్రవిస్తుంది . 

1 ) i , ii , ill 2 ) ii , iii , in 3 ) i , iii , in 4 ) i , ii , iii , iv


 9. కిందివాటిలో వినాళ గ్రంథి లేదా అంతఃస్రావ్య , బహిస్రావ్య గ్రందిగా దేన్ని పేర్కొంటారు ? 

1 ) థైరాయిడ్ 

2 ) థైమస్ 

3 ) పిట్యూటరీ 

4 ) క్లోమం 


10. BMR లేదా బేసల్ మెటబాలిక్ రేటును నియంత్రించే గ్రంధి ఏది ? 

1 ) థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి 

2 ) పారాథైరాయిడ్ గ్రంథి లేదా పార్శ్వ అవటు గ్రంది

 3 ) ముష్కాలు , అండాలు 

4 ) క్లోమం , పిత్తాశయం 


11. రక్తంలో కాల్షియం గాఢతను నియంత్రించే గ్రంథులు ఏవి ? 

1 ) థైరాయిడ్ , క్లోమం 

2 ) క్లోమం , పారాథైరాయిడ్ 

3 ) థైరాయిడ్ , పారాథైరాయిడ్ 

4 ) క్లోమం , పిట్యూటరీ 


12. మానవుడి శరీరంలో అతి పెద్ద అంతఃస్రావ్య గ్రంధి ఏది ? 

1 ) కాలేయం 

2 ) అడ్రినల్ 

3 ) పారాథైరాయిడ్ 

4 ) దైరాయిడ్ 


13. పోరాడే లేదా పలాయనం చెందే అంతః స్రావ్య గ్రంధి అని దేనికి పేరు ? 

1 ) ఆడ్రినల్ 

2 ) థైరాయిడ్ 

3 ) బీజగ్రంథులు 

4 ) పిట్యూటరీ 


14. కిందివాటిలో మానవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు ఏవి ? 

i ) ఈస్ట్రోజన్

 ii ) ప్రొజెస్టిరాన్ 

iii ) టెస్టోస్టిరాన్ 

iv ) థైరాక్సిన్

1 ) i , ii 2 ) i , ii , iii 3 ) i , ii , iii , in 4 ) iii , iv 


15. గర్భనిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్ ఏది ? 

1 ) ఈస్ట్రోజన్ 

2 ) ప్రొజెస్టిరాన్ 

3 ) ఆక్సిటోసిన్ 

4 ) గొనడోట్రోపిన్ 


16. వినాళ గ్రంథులను అవి స్రవించే హార్మోన్ లతో సరిగా జతపరచండి . వినాళ గ్రంథి స్రవించే హార్మోన్ 

i ) పీయూష గ్రంథి a ) అడ్రినలిన్ 

ii ) ముష్కాలు b ) థైరాక్సిన్ 

iii ) అవటు గ్రంథి c ) టెస్టోస్టిరాన్ 

iv ) అడ్రినల్ d ) పెరుగుదల హార్మోన్ e ) అడ్రినిన్ 


1 ) 1 - c , ii - d , iii - b , iv - e 

2 ) 1 - d , ii - c , iii - b , iv - e 

3 ) i - d , ii - c , iii - b , iv - a 

4 ) i - c , ii - d , iii - b , iv - a 


17. చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక రక్షణ వ్యవ స్థలో కీలకపాత్ర పోషించే T- లింఫోసైట్ లను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది ? 

1 ) అడ్రినల్ 

2 ) క్లోమం 

3 ) థైమస్ 

4 ) థైరాయిడ్ 


18. కిందివాటిలో అడ్రినల్ గ్రంధి స్రవించే హార్మోన్లు ఏవి ? 

i ) అడ్రినలిన్ 

ii ) ఆల్డోస్టిరోన్ 

iii ) కార్టిసాల్ 

iv ) DHEA డీహైడ్రోపియాండ్రో స్టిరోన్ సల్ఫేట్ 

1 ) i , ii , ii 2 ) ii , iii , in 3 ) ii , iii 4 ) i , ii , iii , iv


 19. ఏ గ్రంథి దెబ్బతినడం వల్ల గ్రేవ్స్ వ్యాధి కలుగుతుంది ? 

1 ) థైరాయిడ్ గ్రంధి 

2 ) పిట్యూటరీ గ్రంధి 

3 ) అడ్రినల్ గ్రంథి 

4 ) క్లోమం 


20. అడ్రినల్ గ్రంథి స్రవించాల్సిన హార్మోన్లు తగిన స్థాయిలో లేనప్పుడు సంభవించే వ్యాధి ఏది ? 

1 ) డయాబెటిస్ 

2 ) అడిసన్స్ వ్యాధి 

3 ) కుషింగ్ సిండ్రోమ్ 

4 ) హైపోథైరాయిడిజం 


21. ' మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంధికి పేరు ? 

1 ) అవటు గ్రంథి 

2 ) అడ్రినల్ గ్రంథి 

3 ) క్లోమం 

4 ) పిట్యూటరీ గ్రంథి 


22. నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ హార్మోను స్రవించేది ఏది ? 

1 ) అండాలు 

2 ) అడ్రినల్

3 ) పీనియల్ 

4 ) జైరాయిడ్ 


23. ఆక్సిటోసినన్ను స్రవించే గ్రంది ఏది ? 

1 ) పీయూష గ్రంది పరాంత లంబిక 

2 ) పీయూష గ్రంధి పూర్వాంత లంబిక 

3 ) అడ్రినల్ గ్రంధి మధ్య భాగం 

4 ) పారాథైరాయిడ్ గ్రంధి రాంత లంబిక 


24. కాల్సిటోనినను స్రవించే గ్రంధి ఏది ? 

1 ) పిట్యూటరీ 

2 ) దైరాయిడ్ 

3 ) పారాథైరాయిడ్ 

4 ) క్లోమం

ANSWERS

1-4 2-3 3-2 4-2 5-1 6-2 7-3 8-1 9-4

10-1 11-3 12-4 13-1 14-2 15-2 16-3

 17-3 18-4 19-1 20-2 21-4 22-3 

23-1 24-2


Top Post Ad

Below Post Ad