Hot Widget

Type Here to Get Search Results !

Current Affairs 04-09-2021 (TELUGU)

సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తుల నియామకం ::

 Context : సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేశారు . ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం కూడా ఇదే మొదటిసారి . 

About : రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ( 2 ) మరియు 217 ప్రకారం వరుసగా సుప్రీంకో న్యాయమూర్తులను నియమిస్తారు . 

న్యాయమూర్తుల నియామకం - వివాదం :: 

* సుప్రీంకోర్టు , హైకోర్టు మూర్తుల నియామయం విషయంలో కొలీజియంను సంప్రదించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది . దీన్నే మొదటి జడ్జెస్ కేసు అంటారు . 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1993... 

* సుప్రీంకోర్టు , హైకోర్టు న్యాయమూర్తుల నియామయం విషయంలో సీజేఐని , కొలీజియంను రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదించాలని , సీజేఐ సలహాను తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది . దీన్నే సెకండ్ జడ్జెస్ కేసు అంటారు . 

* రాష్ట్రపతికి సీజేఐ సలహా ఇచ్చేటప్పుడు ఇద్దరు సీనియర్ జడ్జిలను సంప్రదించాలని చెప్పింది . 

* 1998 లో అప్పటి రాష్ట్రపతి కొలీజియంపై సుప్రీంకోర్టు సలహా కోరారు . 

* 1999 లో 9 మంది న్యామయూర్తుల ధర్మాసనం కొలీజియంపై ఇలా వివరణ ఇచ్చింది . 

* కొలీజియంలో సీజీఐతో పాటు మరో నలుగురు జడ్జిలు ఉంటారని , రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలని , కొలీజియంను సంప్రదించాక న్యాయమూర్తులను నియమించాలని పేర్కొంది . 

థర్డ్ జడ్జెస్ కేసు ::

* సుప్రీంకోర్టు జడ్జిల నియామకం విషయంలో సీజేఐ నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించాలి . 

* ఇందులో ఇద్దరు వ్యతిరేకిస్తే రికమండేషనను రాష్ట్రపతికి పంపొద్దు . 

ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ 2021 ::

Context : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ లో జరిగిన 6 వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ ( ఇఇఎఫ్ ) సర్వ సభ్య సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు . 2019 వ సంవత్సరం లో జరిగిన ఇఇఎఫ్ 5 వ సదస్సు లో ముఖ్య అతిథి గా ప్రధాన మంత్రి వ్యవహరించారు . ఇఇఎఫ్ సదస్సు లో భారతదేశ ప్రధాన మంత్రి ముఖ్య అతిధి గా వ్యవహరించడం అదే తొలిసారి .  

* రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతాల అభివృద్ధి విషయం లో అధ్యక్షుడు శ్రీ పుతిన్ దార్శనికత ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ , ఈ విషయం లో భారతదేశం తన ' యాక్ట్ ఈస్ట్ పాలిసి ' లో భాగం గా రష్యా కు ఒక విశ్వసనీయ భాగస్వామి గా ఉంటుందని పునరుద్ఘాటించారు . 

* రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతం అభివృద్ధి విషయం లో రష్యా కు , భారతదేశానికి సహజమైన అనుబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు .  

* ' ప్రత్యేకమైనటువంటి , విశేష అధికారాలు కలిగినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాని ' కి అనుగుణం గా ఇరు పక్షాల మధ్య మరింత ఎక్కువ ఆర్థికపరమైనటువంటి , వాణిజ్యపరమైనటువంటి సహకారానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు . 

* మహమ్మారి కాలం లో ఆరోగ్య సంబంధి , ఔషధ నిర్మాణ సంబంధి రంగాలు సహకారానికి ప్రముఖమైన రంగాలు గా పేరు తెచ్చుకొన్నాయి అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు . 

* అలాగే , ఆర్ధిక సహకారం పరం గా అవకాశాలు ఉన్న ఇతర రంగాల లో వజ్రాలు , కోకింగ్ కోల్ , ఉక్కు , కలప వంటి రంగాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు . 

24 వ ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి ::

Context : కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక స్థిరత్వ , అభివృద్ధి మండలి ( ఎస్ఎస్ డిసి ) 24 వ సమావేశానికి అధ్యక్షత వహించారు . 

చర్చించిన అంశాలు ::

ఎస్ఎస్ డిసికి సంబంధించిన వివిధ అంశాలు - ఆర్థిక స్థిరత్వం , ఆర్థిక రంగ అభివృద్ధి , నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం , ఆర్థిక అక్షరాస్యత , ఆర్థిక కార్యకలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడం , స్థూల ఆర్ధిక పర్యవేక్షణ , భారీ ఆర్థిక సంస్థల పనితీరు వంటి పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు . 

* ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం , నియంత్రణ సంస్థలు నిరంతర నిఘా ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు . 

* ఒత్తిడిలో ఉన్న ఆస్తులు , ఆర్థిక స్థిరత్వ విశ్లేషణకు సంబంధించి వ్యవస్థాత్మక యంత్రాంగం పటిష్ఠత , ఆర్థిక కార్యకలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడం , ఆర్థిక సంస్థల మధ్య వివాదాల పరిష్కార యంత్రాంగం , ఇబిసి సంబంధిత అంశాలు , ప్రభుత్వం , విభిన్న రంగాలకు బ్యాంకుల రుణ వితరణ , ప్రభుత్వ అధికారుల మధ్య డేటా మార్పిడి , రూపాయికే అంతర్జాతీయ హోదా కల్పించడం , పెన్షన్ సంబంధిత అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు . 

Top Post Ad

Below Post Ad