1 ) ఈ తినుబండారాలలో వినాయక చవితికి సంబంధించినది ఏది ?
A ) పొంగల్
B ) ఉండ్రాళ్ళు
C ) బొబ్బట్లు
D ) కాజు కట్లి
Correct Answer : ఉండ్రాళ్ళు
2 ) వీటిలో రోడ్డుమీద ' U ' ఆకారంలో ఉండే మలుపులని సూచించడానికి ఏ పదం వాడతారు ?
A ) లిప్ స్టిక్
B ) హెయిర్ పిన్
C ) పెర్ఫ్యూమ్
D ) ఐలైనర్
Correct Answer : హెయిర్ పిన్
3 ) ఈ చిత్రంలోని వస్తువుని గుర్తించండి.
A ) రాడార్ గన్
B ) షాట్ గన్
C ) టెంపరేచర్ గన్
D ) వాటర్ గన్
Correct Answer : టెంపరేచర్ గన్
4 ) సాధారణంగా , వీటిలో మహాసముద్రంగా పరిగణించబడనిది ఏది ?
A ) పసిఫిక్
B ) అట్లాంటిక్
C ) హిందూ
D ) అరేబియా
Correct Answer : అరేబియా
5 ) హిటామ్యాన్ ' అని పిలవబడే , ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకి ఎక్కువ మ్యాచ్లు కెప్టెన్గా వ్యవహరించిన క్రికెటర్ ఎవరు ?
A ) హార్దిక్ పాండ్యా
B ) రోహిత్ శర్మ
C ) జస్త్రీత్ బుమ్రా
D ) రాహుల్ శర్మ
Correct Answer : రోహిత్ శర్మ
6 ) వేటికొరకు ' నామినేషన్ ' చేయవచ్చు ?
A ) బ్యాంకు ఖాతాలు
B ) లాకర్లు
C ) రెండూ
D ) పైవి ఏవీ కాదు
Correct Answer : రెండూ
7 ) ఎలకానిక్ వోటింగ్ మెషీన్ జాబితాలో కనిపించే ' NOTA ' లో ' N ' అంటే ఏమిటి ?
A ) నల్
B ) నంబర్
C ) నన్
D ) నేమ్
Correct Answer : నన్
8 ) రామాయణంలో , దశరథుడు మరియు రాముడు పరిపాలించిన రాజ్యం ఏది ?
A ) కోసల
B ) జనక
C ) మిథిల
D ) అంగ Correct Answer : కోసల
9 ) అరకు లోయ వీటిలో ఏ తోటలకు ప్రసిద్ధి ?
A ) రబ్బర్
B ) చెరుకు
C ) కాఫీ
D ) ఆరంజ్
Correct Answer : కాఫీ
10 ) ఈ కట్టడాలలో ఒక యుద్ధస్మారకం ఏది ?
A ) ఇండియా గేట్
B ) చార్మినార్
C ) జంతర్ మంతర్
D ) గేట్వే ఆఫ్ ఇండియా
Correct Answer : ఇండియా గేట్
11 ) గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశ ప్రధాని ముఖ్య అతిథిగా రావాల్సి ఉండి , రద్దు చేసుకున్నారు ?
A ) ఫ్రాన్స్
B ) జర్మనీ
C ) యూకె
D ) దక్షిణాఫ్రికా
Correct Answer : యూకె
12 ) వీరిలో , మహాత్మా గాంధీని ఆప్యాయంగా ' మిక్కీ మౌస్ ' అనే ముద్దు పేరుతో పిలిచినవారు ఎవరు ?
A ) ఎం ఎస్ సుబ్బులక్ష్మీ
B ) ఇందిరా గాంధీ
C ) సరోజినీ నాయుడు
D ) అరుణ అసఫ్ అలీ
Correct Answer : సరోజినీ నాయుడు
13 ) గోల్కొండ పత్రిక అనే పత్రికను స్థాపించి , సంపాదకత్వం వహించిన సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఎవరు ?
A ) విశ్వనాథ సత్యనారాయణ
B ) త్రిపురనేని గోపీచంద్
C ) ఆచార్య రాయప్రోలు సుబ్బారావు
D ) సురవరం ప్రతాపరెడ్డి
Correct Answer : సురవరం ప్రతాపరెడ్డి