నోటిఫికేషన్ నెం: RRCINR - 01 /2021 / యాక్ట్ అప్రెంటీస్
అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఉత్తర రైల్వేలో వివిధ విభాగాలు / యూనిట్లు / వర్క్‌షాప్‌లలో శిక్షణ ఇవ్వడానికి అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 3093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరిస్తున్నారు.
రైల్వేలో శిక్షణ ఇవ్వడం అభ్యర్ధులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రైల్వేలో అప్రెంటీస్‌కు ఉద్యోగం కల్పిస్తోంది .
ప్రాథమిక అర్హత :-
( నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి అంటే 14.09.2021). అభ్యర్థి SSC/మెట్రిక్యులేషన్/10 వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో, గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా ITI లో ఉత్తీర్ణులై ఉండాలి
గమనిక: నోటిఫికేషన్ జారీ చేసిన తేదీన అభ్యర్ధి నిర్దేశించిన అర్హతను ఆప్పటికే పాస్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి SSC/మెట్రిక్యులేషన్/10 వ మరియు ITI ఫలితం కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: (ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అంటే 20.10.2021). అభ్యర్థులు 15 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి మరియు 20-10-2021 నాటికి 24 సంవత్సరాలు నిండి ఉండకూడదు. SC/ST అభ్యర్థుల విషయంలో 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. వికలాంగులకు, గరిష్ట వయోపరిమితిని 10 సంవత్సరాల వరకు సడలిస్తారు.
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 20
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి..
వెబ్‌సైట్: http://www.rrcnr.org/