Hot Widget

Type Here to Get Search Results !

10వ తరగతిలో కొత్తగా విలేజ్ అసిస్టెన్స్ ఉద్యోగాల

 

 ముద్ర విలేజ్ అసిస్టెంట్స్ విధివిధానాలు ::

 మానవ జాతి ఆకృతికి ప్రకృతి ఓ రూపం నివ్వగా నాటి ఆదిమ మానవుడు రాతి యుగంతో కుస్తీ పడగా నేటి ఆధునిక మానవుడు రాకెట్ యుగంతో పోటీ పడుతున్నాడు . మానవ జీవన పరిణామక్రమంలో భాగంగా మొదట నాటి ప్రజలు వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జీవన విధానాన్ని కొనసాగించారు . ఆ తరువాత ధనం ద్వారా అంటే .... నగదు ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు ముడిపడేవిధంగా పరిస్థితులు మారిపోయాయి . ఒక ఊరిలో ఎవరో ఒకరు ఆసామి లేదా భూస్వామి ధనవంతుడు వుంటే .... అతని నుంచి అప్పు తీసుకొని .... అతనికే మొత్తం నాటి రైతులు అతడు చెప్పిన ధరకు మొత్తం తమ పంట ఉత్పత్తులు అమ్మేవారు . ఆ తరువాత రాను రాను ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది . కొంతమంది వ్యక్తులు ఓ సంఘం కింద ఏర్పడి ... ఆ సంఘం ద్వారా తమ అవసరాలకు ఒక్కొక్కరు కొంత కొంత అన్నట్లుగా తమ దగ్గర పున్న కొద్దిపాటి ధనాన్ని పోగు చేసుకొని తమ అవసరాలకు వాడుకుంటూ వచ్చారు . అలా ... ఏర్పడిన సంఘాలే ఆ తరువాత సహకార సంఘాలుగా అవతరించాయి . బ్యాంకులంటే ఏమిటో ప్రజలకు తెలియని రోజులలోనే సహకార సంఘాలు ఆవిర్భవించాయి . బ్రిటీష్ ప్రభుత్వం మొదట భారతదేశంలో 1904 లోనే సహకార సంఘాలకు చట్టభద్రత కల్పిస్తూ సహకార చట్టాన్ని తీసుకువచ్చింది . తరువాత సహకార సంఘాలు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాయి . మొదటి ప్రధాని నెహ్రూ హయాంలో ఇవి ఉచ్ఛ స్థితికి చేరాయి . ఈ మధ్య రెండు మూడు దశాబ్దాల పాటు భారతదేశంలో సహకార వ్యవస్థలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి . ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ మళ్లీ సహకార వ్యవస్థకు జవసత్వాలు తీసుకొస్తున్న విధానంలో భాగంగా నేరుగా సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు .

 సెంట్రల్ కో - ఆపరేటివ్ యాక్ట్ -2002 కింద ఏర్పడిన జాతీయ సహకార సంఘాలలో ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్ మెంట్ మల్టీస్టేట్ కో - ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఒకటి . ఇది 2017 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది . ఈ నాలుగు సంవత్సరాలలో ఏ కో - ఆపరేటివ్ సొసైటీకి మరే విధమైన కో - ఆపరేటివ్ బ్యాంక్ కు రాని గుర్తింపు ఈ సొసైటీకి వచ్చింది . ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సరాసరి 300 బ్రాంచులతో ఇంచుమించు 2000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు . ఇంకా ఈ సొసైటీ ఆధ్వర్యంలో కొన్ని చోట్ల మార్లు ( సూపర్ బజార్లు ) , ఫర్టిలైజర్స్ షాపులు , ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయి . కొన్ని చిన్నతరహా పరిశ్రమలు కూడా నడుస్తున్నాయి . త్వరలో అనేక చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి . ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాలనందు ఎ.పి.ఐ.ఐ.సి. ఎస్టేట్లనందు ముద్ర ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి స్థలాలు కొనడమైనది . తెలంగాణలో ఇదేవిధమైన యూనిట్ల నిర్మాణానికి కొన్ని ప్రైవేట్ స్థలాలు కొనడమైనది . ముఖ్యంగా సిద్ధిపేట హైవేలో బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద కొన్న మూడెకరాల స్థలం నందు ఏడు కోట్లతో స్పెషల్ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కాబోతున్నది . దేశవ్యాప్తంగా త్వరలో ముద్ర ఆధ్వర్యంలో అనేక మార్కెటింగ్ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి . ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నందు విస్తరించి వున్న ' మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ' కూలీలకు ఈ సొసైటీలో సభ్యత్వం కల్పించి అనేక రకాల సౌకర్యాలు , ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించడమైనది . ఆ ఉపాధి హామీ పథకం కూలీల ( జాబ్ కార్డ్ హెల్డర్స్ ) ను సొసైటీలో సభ్యులుగా చేర్పించి వారిని పొదుపులసందు భాగస్వాములను చేపించి వారు ఇంకా ఆర్థిక స్వావలంబన పొందడానికి ఈ సొసైటీ తరపున చేయూత నివ్వడానికి సొసైటీకి , ఆ ఉపాధి హామీ పథకం కూలీలకు సంధానకర్తలుగా పనిచేసేవారే ఈ ' ముద్ర విలేజ్ అసిస్టెంట్లు ' . 

ఎంపిక విధానం ::

 పదవ తరగతి పాసైన యువతీ యువకులు 18 సం || రాలు పైబడి 43 సం || రాల లోపు వున్నవాళ్లు ఈ వెబ్ సైట్ నందలి ' విలేజ్ అసిస్టెంట్ అప్లికేషన్ ' డౌన్ లోడ్ చేసుకొని సొసైటీ నిబంధనల మేరకు ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్ మెంట్ మల్టీ స్టేట్ కో - ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరున రూ . 1300 / -లు డి.డి. తీసి భర్తీ చేసిన అప్లికేషన్ కు అతికించి పంపించవలెను . లేదా సొసైటీ అకౌంట్లనందు రూ . 1300 / -లు డిపాజిట్ చేసి ఆ కౌంటర్ స్లిప్ ను అప్లికేషను జతచేయవలెను . దరఖాస్తుదారులందరికీ  ' సహకార భారతం ' అనే పుస్తకం పంపించబడును . అందులోని సమాచారాన్ని పూర్తిగా చదివి ఆ పుస్తకంతో పాటు పంపిన ప్రశ్నపత్రానికి అనుగుణంగా జవాబులు పోస్టల్ ద్వారా పంపించవలెను . దరఖాస్తులు మాకు చేరడానికి ఆఖరు తేది : 15-09-2021 . వీరందరికీ 25-09-2021లోగా సహకార భారతం పుస్తకం , ప్రశ్నపత్రం , ఇతరత్రా  2 ప్రింటెడ్ మెటీరియల్ వారి చిరునామాకు రిజిష్టర్ పోస్ట్ లేదా కొరయర్ ద్వారా పంపించబడును . ప్రశ్నలకు జవాబులు 10-10-2021 లోగా మాకు చేరాలి . వచ్చిన జవాబులను దిద్ది ఎంపికైనవారి జాబితాను నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నాము . ఎంపికైనవారు డిసెంబర్ 1 వ తేదీ నుంచి సొసైటీ నిబంధనలు పాటించి విధులలో చేరవలసి వుంటుంది . ఎనిమిది వేలు గౌరవ వేతనంతో పాటు టార్గెట్ పూర్తి చేసిన వారికి అదనపు అలవెన్సులు వుంటాయి . ఇంకా ఇన్సెంటిమ కూడా వుంటాయి . ఇందులో విధులలో చేరి సంవత్సరం సీనియారిటీ సాధించినవారికి పర్సనల్ లోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడమైనది . పూర్తిగా మెరిట్ మీద ఎంపిక చేయబోతున్నాము . 

నోట్ ::

గతంలో ఇదే ముద్ర తరపున నోటిఫికేషన్లు ఇచ్చి బ్రాంచులనందు మేనేజర్లుగా , అకౌంటెంట్లుగా , ఫీల్డ్ ఆఫీసర్లుగా అవకాశాలు కల్పించడమైనది . మరికొందరికి మార్కెటింగ్ సూపర్‌వైజర్లుగా , మార్కెటింగ్ మేనేజర్లుగా కూడా అవకాశం కల్పించడమైనది . వీరి చేతికి సొసైటీకి సంబంధించిన నిధులు అప్పగిస్తున్నందున సొసైటీ ఆర్ధిక భద్రత కొరకు డిపాజిట్ తీసుకొని వారికి వారి భద్రత కొరకు బాండ్లు ఇవ్వడమైనది . అయితే .... ఈ విలేజ్ అసిస్టెంట్లకు ఏమాత్రం డిపాజిట్లు తీసుకోవడం జరగదని చెప్పడమైనది . వీరు అప్లికేషతో పాటు చెల్లిస్తున్న రూ .1300 / -లలో సభ్యత్వం మరియు ఇతరత్రా సర్వీసింగ్ ఫీజుల కింద 300 రూపాయలు మినహాయించుకొని వెయ్యి రూపాయలను రెండు షేర్ల కింద భావించి ఆ వెయ్యి రూపాయలను డివిడెండ్ తో కలిపి ఏడాది తరువాత ఇవ్వడం జరుగుతుందని తెలపడమైనది . ఈ వెయ్యి రూపాయలకు వెంటనే ముద్ర సొసైటీ పాస్ బుక్ పంపించడం జరుగుతుంది . స్వంత గ్రామంలో ఉద్యోగం వస్తున్నందున ఆకాశమే హద్దుగా భావించి అనేకమంది యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది . ఆంధ్రప్రదేశ్ లో 21843 గ్రామపంచాయితీలు వున్నందున మేజర్ పంచాయితీలకు ఇద్దరిని నియమించబోతున్నందున ఈ రాష్ట్రంలో సరాసరి 23 వేల మందికి అవకాశం కల్పించబోతున్నాము . తెలంగాణలో 12765 గ్రామ పంచాయితీలు పున్నందున ఇక్కడ ఇంచుమించు 14 వేల మందికి అవకాశం కల్పించబోతున్నాము . ఇలా ... రెండు తెలుగు రాష్ట్రాలలో 37 వేల మంది గ్రామీణ వెలుగు కిరణాలకు ముద్ర తరపున ఓ స్థాయి ఉద్యోగం రాబోతున్నదని తెలియజేయడమైనది . 

స్పెషల్ నోట్ ::

రెండు సంవత్సరాలు సీనియారిటీ ఏర్పడిన తరువాత సొసైటీ నిబంధనల మేరకు ఈ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా ( చట్టభద్రత ఉద్యోగులుగా ) పరిగణించడం జరుగుతుంది . 

సొసైటీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు :: 

( 1 ) Mudra Agriculture & Skill Development Multi State Co - operative Society Ltd. Axis Bank , Nallakunta Branch , A / c : 918020102810176 IFSC CODE : UTIB0001381 

( 2 ) Mudra Agriculture & Skill Development Multi State Co - operative Society Ltd. ICICI Bank , Ghatkesar Branch , A / c No.:179305005011 IFSC CODE : ICIC0001793

( 3 ) Mudra Agriculture & Skill Development Multi State Co - operative Society Ltd. Telangana Grameena Bank , A / c : 79037568500 IFSC CODE : SBINORRDCGB

( 4 ) Mudra Agriculture & Skill Development Multi State Co - operative Society Ltd. IDFC Bank .

భర్తీ చేసిన అప్లికేషన్లు పంపించవలసిన చిరునామా ::

 Chairman , Mudra Agriculture & Skill Development Multi State Co - operative Society Ltd. 15 / A , 3-4-757122 , APHB Building , Near Raghavendra Swamy Temple , Barkatpura , Hyderabad , Telangana - 500 027. E - mail : masamscs1273@gmail.com .

Application form::


Notification:: 



Tags

Top Post Ad

Below Post Ad