రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు? Polity bits....


1. ఒక పంచాయతీలో వార్డ్ బడ్జెట్ ఖర్చులు ఆమోదం కంటే ముఖ్యంగా ఉండే పని ఏది?

ఎ) లోకల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి

బి) రాష్ట్రం నుంచి నిధులు పొందాలి

సి) స్థానిక సమస్యలు గుర్తించాలి

డి) ఫైనాన్స్

సమాధానం: సి) స్థానిక సమస్యలు గుర్తించాలి


2. ఒక నగర మేయర్ స్థానిక సమన్వయం సక్రమంగా నిర్వహించకపోతే ప్రజలు ఏ స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు?

ఎ) ముఖ్యమంత్రి

బి) రాష్ట్ర ఎన్నికల కమిషన్

సి) మున్సిపల్ కమిషనర్

డి) సుప్రీంకోర్టు

సమాధానం: సి) మున్సిపల్ కమిషనర్


3. పంచాయతి అభివృద్ధి ప్రణాళికలో మహిళా స్వయం సహాయక గుంపులకు నిధులు కేటాయించడం ఏ విధానానికి సూచన?

ఎ) లింగ సాధికారత

బి) ఆర్థిక సమానత్వం

సి) రాజ్యాంగ రిజర్వేషన్

డి) న్యాయపరమైన సమీకరణ

సమాధానం: ఎ) లింగ సాధికారత


4. ఒక గ్రామ సభ బడ్జెట్ ఆమోదించకపోతే పంచాయతి ఏం చేయాలి?

ఎ) పట్టించుకోకుండా కొనసాగాలి

బి) తిరిగి ప్రణాళిక సమర్పించాలి

సి) అన్ని పనులు నిలిపివేయాలి

డి) సుప్రీంకోర్టును ఆశ్రయించాలి

సమాధానం: బి) తిరిగి ప్రణాళిక సమర్పించాలి

5. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?

ఎ) ప్రధాని

బి) గవర్నర్

సి) ముఖ్యమంత్రి

డి) రాష్ట్రపతి

సమాధానం: బి) గవర్నర్


6. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయే అధికారం ఎవరికీ లేదు?

ఎ) గవర్నర్

బి) హైకోర్టు

సి) రాష్ట్ర ఎన్నికల కమిషన్

డి) రాష్ట్ర ప్రభుత్వం

సమాధానం: డి) రాష్ట్ర ప్రభుత్వం


7. పంచాయితీల టర్మ్ ముగిసే ముందు ఎన్నికలు నిర్వహించకపోతే ఏమవుతుంది?

ఎ) గవర్నర్ పాలన కొనసాగుతుంది

బి) తాత్కాలిక పరిపాలనాధికారిని నియమించాలి

సి) గ్రామ సభ కొనసాగుతుంది

డి) రాష్ట్రపతి నిబంధనలు వర్తిస్తాయి

సమాధానం: బి) తాత్కాలిక పరిపాలనాధికారిని నియమించాలి


8. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది?

ఎ) 8వ భాగం

బి) 9, 9ఎ భాగం

సి) 10వ భాగం

డి) 11వ భాగం

సమాధానం: బి) 9, 9ఎ భాగం


9. 73, 74వ సవరణల ప్రధాన లక్ష్యం ఏమిటి?

ఎ) కేంద్రాలను బలోపేతం చేయడం

బి) రాష్ట్రాలను బలోపేతం చేయడం

సి) స్థానిక స్వయం పాలిత ప్రభుత్వాల బలోపేతం

డి) పార్లమెంటును బలోపేతం చేయడం

సమాధానం: సి) స్థానిక స్వయం పాలిత ప్రభుత్వాల బలోపేతం

Top

Below Post Ad