Hot Widget

Type Here to Get Search Results !

జెనరల్ నాలెడ్జ్ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. కింది సమాచారాన్ని పరిశీలించండి . 

ఎ . ఈ మండలంలో వేసవి కాలం పొడిగా , శీతాకాలం లో వర్షం సంభవిస్తుంది . 

బి . ఆలీవ్ , ఓక్ వంటి వృక్షజాతులు పెరుగుతాయి .

 సి . ఈ మండలం ముఖ్యంగా పండ్లతోటలకు ప్రసిద్ధి పై సమాచారం ఆధారంగా ప్రకృతి సిద్ధ మండలాన్ని గుర్తించండి . 

1 ) ఉష్ణమండల పచ్చిక బయళ్లు 

2 ) మధ్యదరా శీతోష్ణస్థితి మండలం 

3 ) సమశీతోష్ణ మండల గడ్డి భూములు 

4 ) టైగా మండలం 


2. మహదాయి నదీ జలాల పంపకంపై ఇటీవల అంతిమ తీర్పు వెలువడింది . ఈ నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి ? 

ఎ . గుజరాత్ 

బి . కర్ణాటక

సి . గోవా 

డి . మహారాష్ట్ర

 సరియైన సమాధానాన్ని ఎన్నుకోండి , 

1 ) ఎ , బి , సి 2 ) బి , సి , డి 3 ) ఎ , బి , డి 3 ) ఎ , సి , డి 


3. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ నెలకొని ఉన్నది ? 

1 ) మధ్య హిమాలయాలలో 

2 ) బాహ్యహిమాలయాలలో 

3 ) కేంద్ర హిమాలయాలలో 

4 ) శివాలిక్ 


4. కింది వాటిని జతపరచండి . 

జాబితా -1 జాబితా -2 

1 చెరుమ్రాని డ్యాం ఎ . మధ్యప్రదేశ్ 

2. ఇందిరాసాగర్ డ్యాం బి . తమిళనాడు 

3. శ్రీశైలం డ్యాం సి . ఆంధ్రప్రదేశ్ 

4. మెట్టూర్ డ్యాం డి . కేరళ 

1 ) 1 - డి , 2 - ఎ , 3 - సి , 4 - బి 

2 ) 1 - బి , 2 - సి , 3 - ఎ , 4 - డి 

3 ) 1 - సి , 2 - బి , 3 - డి , 4 - ఎ 

4 ) 1 - ఎ , 2 - బి , 3 - సి , 4 - డి 


5. ' ఆయుష్మాన్ భారత్ ' పథకానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి . 

ఎ . ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకమైన దీనిని ' ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ' పేరుతో ప్రారంభించారు . 

బి . లబ్ధిదారులను సామాజిక , ఆర్థిక కుల గణన ( ఎన్‌సిసి ) 2011 ఆధారంగా ఎంపిక చేస్తారు , 

సి . దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది లబ్ధిదారులకు రూ , 10 లక్షల బీమా సౌకర్యం కలుగుతుంది .

 పైవాటిలో సరి అయిన వాటిని ఎన్నుకోండి . 

1 ) ఎ మాత్రమే 2 ) ఎ , బి మాత్రమే 3 ) సి మాత్రమే 


6. ' నీతి అయోగ్ 75 ' వ్యూహం ప్రకారం 2022-23 నాటికి ఆర్థిక వృద్ధి ఎంత ఉండాలని సూచించారు ? 

1 ) 8 శాతం 

2 ) 10 శాతం 

3 ) 9 శాతం 

4 ) 12 శాతం 


7. పారిశ్రామిక సూచీ 2017-18 ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన రంగం ? 

1 ) విద్యుచ్ఛక్తి 

2 ) రిఫైనరీ ఉత్పత్తులు 

3 ) స్టీలు 

4 ) సహజ వాయువు 


8. భారతదేశంలో అమలులో ఉన్న 1991 నూతన ఆర్థిక సంస్కరణల లక్ష్యాలలో లేని అంశాన్ని గుర్తించండి . 

1 ) పారిశ్రామిక లైసెన్సులు ఎత్తివేత 

2 ) విదేశీ వ్యాపారంలో గల టారిఫీు , కోటాలు తగ్గించడం . 

3 ) ప్రభుత్వ పరిధిని తగ్గించి ప్రయివేటు రంగాన్ని విస్తరించడం 

4 ) ఉపాధి అవకాశాలను పెంచడం 


9. 14 వ ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రాలకు పన్ను సంక్రమణను లెక్కకట్టడానికి ఉపయోగించే కింది పరిమాణముల లో ఏది ఎక్కువ ప్రాధాన్యత కలది ? 

1 ) జనాభా 

2 ) విస్తీర్ణం 

3 ) ఆదాయ వ్యత్యాసం 

4 ) జనాభాలో మార్పు 


10. కింది వానిలో దట్టమైన అడవులను పోలి ఉండే అదవులు ఏవి ? 

1 ) పొదల ప్రాంతం 

2 ) సతత హరితారణ్యాలు 

3 ) ఆకురాల్చే అడవులు 

4 ) ముళ్ల వృక్ష ప్రాంతం 


11. షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం తక్కువగా గల రాష్ట్రం ? 

1 ) మిజోరాం 

2 ) పంజాబ్ 

3 ) హిమాచల్ ప్రదేశ్ 

4 ) మేఘాలయ 


12. ఇటీవల వార్తల్లో నిలిచిన ' బ్రా ' గిరిజన తెగవారు ఏ రాష్ట్రానికి చెందినవారు ? 

1 ) మణిపూర్ 

2 ) మేఘాలయ 

3 ) నాగాలాండ్ 

4 ) మిజోరాం 


13. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన ' షాహీ లిచ్చీ ఏ రాష్ట్రానికి చెందినవారు ? 

1 ) ఉత్తరప్రదేశ్ 

2 ) మహారాష్ట్ర 

3 ) గుజరాత్ 

4 ) బీహార్ 


14. ' చెయ్యేరు ' నది ఏ నదికి ఉపనది ? 

1 ) తుంగభద్ర 

2 ) చంపావతి 

3 ) పెన్నానది 

4 ) శబరి నది 


15. ప్రణాళిక వనరులు అంచనాలతో కూడిన జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశక సూత్రాలను తయారు చేసే బాధ్యత కలది ? 

1 ) ప్రణాళిక సంఘం 

2 ) జాతీయ అభివృద్ధి మండలి 

3 ) ఆర్ధిక మంత్రిత్వశాఖ 

4 ) కేంద్రమంత్రివర్గం 


16. ఆరవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ? 

1 ) దీర్ఘకాలపు ప్రణాళిక 

2 ) కనీస అవసరాల పథకం 

3 ) నిరంతర ప్రణాళిక 

4 ) గ్రామీణాభివృద్ధి పథకం 


17. 1946 ఆగస్టు 16 న ప్రత్యక్ష చర్యాదినం దీనికి సంబంధించినది ? 

1 ) ఏ విధంగా అయినా ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాటుకు డిమాండ్ 

2 ) రాయల్ ఇండియన్ నేవీ సభ్యుల తిరుగుబాటు

 3 ) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలో ఖుదాయి కిద్మత్ గర్ చేపట్టిన అహింసాయుత సత్యాగ్రహం

 4 ) పైవాటిలో ఏదీకాదు 


18. ' కమింగ్ రౌండ్ ది మౌంటైన్ ' పుస్తక రచయిత ఎవరు ? 

1 ) ఆర్ కె నారాయణ్ 

2 ) రస్కినా లాండ్ 

3 ) ఖుష్యంత్ సింగ్ 

4 ) ముల్క్ రాజ్ ఆనంద్ 


19. 8 వ ఇండో మయన్మార్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ లో పాల్గొన్న భారత నౌక ? 

1 ) ఐఎన్ఎస్ సుమేధ 

2 ) ఐఎస్ఎస్ సునయన 

3 ) ఐఎన్ఎస్ సరయు 

4 ) ఐఎస్ఎస్ సుమిత్ర 


20 , 2019 గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విజేత ? 

1 ) అలైడ్ బ్రౌన్నెల్ 

2 ) నెద్ ఖాన్ 

3 ) కైరే న్యూవియన్ 

4 ) లీఎన్నే వాల్టర్స్ 


21. " Politics of Jugaad : The Coalition Hand book " పుస్తక రచయిత ఎవరు ? 

1 ) సబనక్వి 

2 ) మధు ట్రెహాన్ 

3 ) షీరెన్ భన్ 

4 ) ప్యాట్రిసియా ముకీమ్ 


22 చైనాలోని గ్జియాలో జరిగిన ఆసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది ?

 1 ) 8 

2 ) 20 

3 ) 12 

4 ) 16 


23. 45 రోజుల మౌంట్ ఎవరెస్ట్ క్లీనింగ్ క్యాంపెయినను నిర్వహించిన దేశం ? 

1 ) చైనా 

2 ) భూటాన్ 

3 ) నేపాల్

 4 ) ఇండియా 


24. జపాన్ కొత్త చక్రవర్తి ఎవరు ? 

1 ) హిరోహిటో 

2 ) అకిహిటో 

3 ) నరుహిటో 

4 ) ఆకిషినో 


25 , 2019 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం థీమ్ ? 

1 ) Sustainable Pension for all : The Role of Social Partners 

2 ) Uniting Workers for Social and Economic Advancement 

3 ) Promote employment by supporting prospective entrepreneurs 

4 ) Let's value work by providing the job less with start - up capital support

Answers 

1.2 2.2 3.3 4.1 5.2 

6.3 7.2 8.2 9.3 10.2

11.1 124 13.4 14.3 15.2

16.3 17.1 18.2 19.3 20.1

21.1 22.4 23.3 24.3 25.1

Top Post Ad

Below Post Ad