Hot Widget

Type Here to Get Search Results !

పార్లమెంటు, అసెంబ్లీ మద్య తేడాలు... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


పార్లమెంటు

 - సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు .

 - ఒక బిల్లు చట్టంగా మారడానికి ఈ దశలుంటాయి .

 - సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు . 

- ఒకసభ ఆమోదం పొందిన బిల్లు మరో సభకు వచ్చినప్పుడు , ఆ సభ 6 నెలల వరకు ఆ బిల్లును వాయిదా వేయవచ్చు .

 - సాధారణ బిల్లు విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారాలు ఉంటాయి

 - ద్రవ్యబిల్లు విషయంలో లోకసభదే అంతిమ నిర్ణయం . ద్రవ్యబిల్లుపై రాజ్యసభలో చర్చించవచ్చు . ఓటింగ్ అధికారం లేదు . రాజ్యసభ 14 రోజుల్లోగా ద్రవ్య బిల్లుపై తన నిర్ణయాన్ని తెలపాలి .

 - రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు .

రాష్ట్ర శాసనసభ

 - సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు . 

- ఒక బిల్లు చట్టంగా మారడానికి 3 దశలు ఉంటాయి .

 - ఈ విషయంలో ఉభయసభల మధ్య సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు . దిగువసభ నిర్ణయమే చెల్లుబాటవుతుంది . 

- విధానసభ ఆమోదం పొందిన బిల్లు పరిషత్ ఆమోదానికి వచ్చినప్పుడు , ఆ బిల్లును గరిష్టంగా 4 నెలలవరకు వాయిదా వేయవచ్చు 

- సాధారణ బిల్లు విషయంలోనూ విధాన సభ నిర్ణయమే అంతిమంగా చెల్లుబాటు అవుతుంది .

 - ద్రవ్యబిల్లు విషయంలో విధాన సభదే అంతిమ నిర్ణయం - ద్రవ్యబిల్లుపై విధాన పరిషత్ లో చర్చించవచ్చు , ఓటింగ్ అధికారం లేదు . విధాన పరిషత్ 14 రో జుల్లోగా ద్రవ్యబిల్లుపై తన నిర్ణయాన్ని తెలపాలి . 

- రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపాదించే అధికారం శాసనసభకు లేదు . కానీ పార్లమెంటు ఆమోదించి న కొన్ని రాజ్యాంగ సవరణలను శాసనసభల అంగీకారం కోసం నివేదిస్తారు .

Top Post Ad

Below Post Ad