1. కిందివాటిలో ప్రాథమిక ప్రమాణం కానిది ఏది ?
1 ) న్యూటన్
2 ) 205 ( Joule )
3 ) పాస్కల్
4 ) పైవన్నీ
2. CC దేనికి ప్రమాణం ?
1 ) ఘనపరిమాణం
2 ) పొడవు
3 ) ద్రవ్యరాశి
4 ) ఏదీకాదు
3. బ్రిటిష్ పద్ధతి అని ఏ ప్రమాణాల వ్యవస్థకి పేరు?
1 ) C.G.S. పద్ధతి
2 ) F.P.S. పద్ధతి
3 ) M.K.S. పద్ధతి
4 ) SI పద్దతి
4. వైశాల్యానికి ప్రమాణం కానిది ఏది ?
1 ) బార్న్
2 ) చదరపు మీటర్
3 ) చదరపు అడుగు
4 ) ఏది కాదు
5. ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణ ( SI ) పద్ధతిలో ప్రమాణం ఏమిటి ?
1 ) సెల్సియస్
2 ) సెంటిగ్రేడ్
3 ) కెల్విన్
4 ) ఫారన్‌హీట్
6. F.P.S. పద్ధతిలో పౌండ్ దేనికి ప్రమాణం ?
1 ) భారం
2 ) ద్రవ్యరాశి
3 ) పొడవు
4 ) కాలం
7. అన్ని ప్రమాణ పద్ధతుల్లో ఒకే ప్రమాణాన్ని కలిగి ఉన్న ఏకైక భౌతికరాశి ?
1 ) పొడవు
2 ) కాలం
3 ) ద్రవ్యరాశి
4 ) పీడనం
8. కిందివాటిలో రుణాత్మక విలువలు కలిగి ఉండనిది ?
1 ) స్థానభ్రంశం
2 ) వేగం
3 ) త్వరణం
4 ) కాలం
9. ఒక న్యూటన్ ఎన్ని డైన్లకు సమానం ?
1 ) 102
2 ) 103
3 ) 104
4 ) 105
10. కిందివాటిలో పౌనఃపున్యానికి ప్రమాణం ఏది ?
1 ) హెర్జ్
2 ) భ్రమణాలు / సెకన్
3 ) 1 / సెకన్
4 ) పైవన్నీ
11. పొడవుకి అతిచిన్న ప్రమాణం ఏమిటి ?
1 ) ఫెర్మీ
2 ) ఆంగ్ స్ట్రామ్
3 ) నానోమీటర్
4 ) మైక్రాన్
12. ' కిలో ' కిందివాటిలో దేన్ని సూచిస్తుంది ?
1 ) ద్రవ్యరాశి
2 ) భారం
3 ) సంఖ్య
4 ) బరువు
13. భారానికి SI ప్రమాణం ?
1 ) డైన్
2 ) కేజీ
3 ) న్యూటన్
4 ) గ్రామ్
14. పని లేదా శక్తి లేదా ఉష్ణానికి C.G.S. ప్రమాణం ఏమిటి ?
1 ) జౌల్
2 ) ఎర్గ్
3 ) క్యాలరీ
4 ) పైవన్నీ
15. కిందివాటిలో శూన్య కెల్విన్ ఉష్ణోగ్రతకు సమానమైంది ఏది ?
1 ) -273 ° F
2 ) 459.6 ° F
3 ) -459.6 ° F
4 ) 273 ° C
16. కిందివాటిలో ప్రాథమిక ప్రమాణం ఏది ?
1 ) క్యాండిలా
2 ) ఆంపియర్
3 ) సెకన్
4 ) ఏదీకాదు
17. పొడవు దూరానికి అతిపెద్ద ప్రమాణం ఏది ?
1 ) కాంతి సంవత్సరం
2 ) ఖగోళ ప్రమాణం
3 ) పార్సెక్
4 ) నాటికల్ మైల్
18. కిందివాటిలో సరికానిది .
1 ) 1 మైల్ = 1.6 మీటర్
2 ) 1 అడుగు = 0.3 మీటర్
3 ) 1 అంగుళం = 2.54 సెంటీమీటర్
4 ) ఏదీకాదు
19. కిందివాటిలో అయస్కాంత అభివాహానికి ప్రమాణం ఏది ?
1 ) వెబర్
2 ) టెస్లా
3 ) హెన్రీ
4 ) వెబర్ / మీటర్
20. కంటి అద్దం నాభీయ సామర్థ్యానికి SI ప్రమాణం ?
1 ) వాట్
2 ) ఎర్గ్
3 ) డయాప్టర్
4 ) ఫారడ్
21. కిందివాటిలో ధ్వని తీవ్రతకు ప్రమాణం ?
1 ) బెల్
2 ) డెసిబెల్
3 ) 1 , 2
4 ) ఏదీకాదు
22. భూమికి , సూర్యుడికి మధ్య దూరాన్ని ఏ ప్రమాణంతో సూచిస్తారు ?
1 ) కాంతి సంవత్సరం
2 ) ఖగోళ ప్రమాణం
3 ) కాంతి నిమిషం
4 ) కాంతి సెకన్
23. ఏకాంక ఘనపరిమాణానికి ఉండే ద్రవ్యరా శిని ఏమని పిలుస్తారు ?
1 ) బలం
2 ) సాంద్రత
3 ) పీడనం
24. ప్రమాణాలు , మితులు లేని భౌతికరాశి ?
A. సాపేక్ష సాంద్రత
B. వక్రీభవన గుణకం
C. వికృతి ( Strain )
D. ప్లాంక్ స్థిరాంకం
1 ) A , B , C 2 ) B , C , D 3 ) A , C 4 ) A , B , C , D
25. కిందివాటిలో పీడనానికి ప్రమాణం ?
1 ) బార్
2 ) టార్
3 ) పాస్కల్
4 ) పైవన్నీ
26. క్యూసెక్ దేనికి ప్రమాణం ?
1 ) నీటి ఘనపరిమాణం
2 ) నీటి ప్రవాహ ఘనపరిమాణ రేటు
3 ) నీటి వేగం
4 ) పైవన్నీ
27. గ్యాలన్ దేనికి ప్రమాణం ?
1 ) వడి
2 ) ఘనపరిమాణం
3 ) చమురు
4 ) పైవన్నీ
28. ఒక కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానం ?
1 ) 106
2 ) 107
3 ) 108
4 ) 109
29. కిందివాటిలో దూరాన్ని కొలిచే పరికరం ?
1 ) ఓడోమీటర్
2 ) పాథోమీటర్
3 ) స్పీడోమీటర్
4 ) క్రోనోమీటర్
30. హైగ్రోమీటర్తో దేన్ని కొలుస్తారు ?
1 ) ఆర్థత
2 ) పాల స్వచ్ఛత
3 ) ద్రవం సాపేక్ష సాంద్రత
4 ) ఏదీకాదు
31. ఎత్తును కొలిచే ఆల్టీ మీటర్ దేని రూపాం తరం?
1 ) మానోమీటర్
2 ) బారో మీటర్
3 ) పాథోమీటర్
4 ) ఏదీకాదు.
ANSWERS
1-4 2-1 3-2 4-4 5-3 6-2 7-2 8-4 9-4 10-4
11-1 12-3 13-3 14-2 15-3 16-4 17-3 18-4
19-1 20-3 21-3 22-2 23-2 24-1 25-4 26-2 27-2 28-1 29-1 30-1 31-2