1. జడత్వ ద్రవ్యరాశిని సూచించేది ?
1 ) F/A
2 ) w/g
3 ) m/v
4 ) పైవన్నీ
2. వస్తువు స్థిరత్వాన్ని ( Stability ) నిర్ణయించేది ఏది ?
1 ) ద్రవ్యరాశి కేంద్రం
2 ) గరిమనాభి
3 ) ఘర్షణ
4 ) పైవన్నీ
3. పాల స్వచ్ఛతను కొలిచే లాక్టోమీటర్ దేనికి ప్రతి రూపం?
1 ) హైడ్రోమీటర్
2 ) హైగ్రోమీటర్
3 ) మానోమీటర్
4 ) బారోమీటర్
4. ద్రవంలోని ఒక బిందువు వద్ద పీడనం దేనితో పెరుగుతుంది ?
1 ) ద్రవం స్వేచ్ఛాతలం నుంచి బిందువు ఉండే లోతుతో
2 ) ద్రవం సాంద్రత
3 ) గురుత్వత్వరణం
4 ) పైవన్నీ
5. బారోమీటర్ రీడింగ్ క్రమంగా పెరిగితే , ఆది దేన్ని సూచిస్తుంది ?
1 ) సాధారణ వాతావరణం
2 ) తుపాను రాకను
3 ) వర్షం రాకను
4 ) శీతల వాతావరణం
6. విమానం నడిపే వైలబ్ , పీడనాన్ని కొలిచేందుకు వాడే పరికరం ?
1 ) బారోమీటర్
2 ) అనేరాయిడ్ బారోమీటర్
3 ) ఫార్టిన్ బారోమీటర్
4 ) మానోమీటర్
7. బారోమీటర్ రూపాంతరాలు ....
1 ) మానోమీటర్
2 ) స్పిగ్మోమానోమీటర్
3 ) అల్టీమీటర్
4 ) పైవన్నీ
8. వృత్తాకార రోడ్డుపై మలుపు తిరుగుతున్న కారు వేగాన్ని రెట్టింపు చేస్తే , అది బోల్తా పడే అవకాశం ..
1 ) రెట్టింపు అవుతుంది
2 ) సగం అవుతుంది
3 ) నాలుగు రెట్లు అవుతుంది
4 ) మారదు
9. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహంలోని వస్తువు భార రహిత స్థితిని పొందడానికి కారణం ....
1 ) త్వరణం
2 ) జడత్వం
3 ) జీరో గ్రావిటి ( శూన్య గురుత్వం )
4 ) పైవన్నీ
10. సీలింగ్ ఫ్యాన్ రెక్కల పొడవు పెంచితే , దాని వేగం తగ్గిపోతుందని వివరించే నిత్యత్వ నియమం ఏది ?
1 ) శక్తి నిత్యత్వ నియమం
2 ) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమ
3 ) రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
4 ) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
11. ట్రాన్స్ఫర్మర్ విషయంలో సరికానిది ఏది ?
ఎ . ఇది అన్యోన్య ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది .
బి . ప్రాథమిక వలయంలోని చుట్ల సంఖ్య , గౌణ వల యంలోని చుట్ల సంఖ్య కంటే ఎక్కువ అయితే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ ఫార్మర్ అంటారు .
సి . ట్రాన్స్ ఫార్మర్‌ను స్టెబిలైజర్లలో ఉపయోగిస్తారు . స్వయం ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది .
1 ) ఎ , బి 2 ) బి , సి 3 ) బి , సి , డి 4 ) ఎ , సి , డి
12. విద్యుత్ బల్బులను శ్రేణిలో కలిపినప్పుడు అందులో ఒక బల్బు కాలిపోతే ...
1 ) మిగతావన్నీ కాలిపోతాయి
2 ) కొన్ని మాత్రమే కాలిపోతాయి
3 ) అన్ని బల్బులు వెలుగుతాయి
4 ) అన్ని బల్బులు ఆరిపోతాయి
13. కింది వాటిలో అదిశా రాశి ఏది ?
1 ) వేగం
2 ) బలం
3 ) శక్తి
4 ) కోణీయ ద్రవ్యవేగం
14. ఒక తరంగ జనకం 0.1 సెకన్ల కాలంలో 10 శృంగాలు , 10 ద్రోణులను ఉత్పత్తి చేస్తే , తరంగ పౌనఃపున్యం ఎంత ?
1 ) 10 Hz
2 ) 5 Hz
3 ) 50 Hz
4 ) 100 Hz
15. కెప్లర్ మూడో గమన నియమం ప్రకారం t²~r³ ఇక్కడ t గ్రహం పరిభ్రమణ కాలాన్ని సూచిస్తే , R దేన్ని సూచిస్తుంది ?
1 ) సూర్యుడు , గ్రహానికి మధ్య దూరం
2 ) సూర్యుడు , గ్రహానికి మధ్య సగటు దూరం
3 ) గ్రహం వ్యాసార్థం
4 ) ఏదీ కాదు
16. న్యూటన్ సూత్రాలు ఎన్ని?
1 ) 1
2 ) 2
3 ) 3
4 ) ఏవి కావు
17. స్థిర తరంగాల్లో శక్తి ...
1 ) ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణిస్తుంది .
2 ) రెండు స్థిర బిందువుల మధ్య స్థిరంగా ఉంటుంది .
3 ) అనంతం
4 ) శూన్యం
18. కింది అంశాలను జతపరచండి .
జాబితా -1 జాబితా -2
1 ) ప్రేరకత్వం a ) పాయిజ్ ( Poise )
ii ) ధ్వని తీవ్రత b ) హెన్రీ
iii ) స్నిగ్ధతా గుణకం c ) బెల్
iv ) శక్తి d ) ఎలక్ట్రాన్ వోల్ట్
1 )i - b , ii - c , ill - a , iv - d
2 ) i - a , i - c , iii - b , iv - d
3 ) i - d , il - a , ill - b , iv - C
4 ) 1 - c , i - b , lil - a . v.d
19. అమ్మీటర్ , వోల్ట్ మీటర్ గా మార్చాలంటే ...
1 ) తక్కువ నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
2 ) ఎక్కువ నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
3 ) షంట్ ని తొలగించి అధిక నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
4 ) షంట్ ని తొలగించి అధిక నిరోధాన్ని సమాంతరంగా కలపాలి
20. రెండు లోహ పలకలపై సమాన , వ్యతిరేక ఆవేశాలను కలిగి ఉండి , విద్యుత్ శక్తిని నిల్వ చేసే పరికరం ఏది ?
1 ) ట్రాన్స్ఫర్మర్
2 ) కెపాసిటర్
3 ) రెక్టిఫయర్
5 ) ఇండక్టర్
21. ఒక మీటర్ స్కేలు కాంతి వేగంతో ప్రయాణిస్తే , దాని పొడవు
1 ) శూన్యం
2 ) అనంతం
3 ) 50 నెం.మీ
4 ) 25 సెం.మీ.
22. అణుబాంబులో జరిగే చర్య ఏది ?
1 ) నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి
2 ) అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి
3 ) అనియంత్రిత కేంద్రక సంలీనం
4 ) నియంత్రిత కేంద్రక సంలీనం
23. తీగ విశిష్ట నిరోధం దేనిపై ఆధారపడుతుంది ?
1 ) ద్రవ్యరాశి
2 ) తీగ పొడవు
3 ) తీగ మధ్యచ్ఛేదం
4 ) ఏదీకాదు
24. ఆయస్కాంతం నుంచి స్వభావాన్ని తొలగించాలంటే ...
1 ) వేడి చేయాలి
2 ) సజాతీయ ద్రువాలు కలిసే విధంగా మరో ఆయ స్కాంతంతో కలిపి ఉంచాలి .
3 ) సుత్తితో కొట్టాలి
4 ) పైవన్నీ
25. భూఅయస్కాంతత్వంతో ముడిపడిన రేఖలు ... 1 ) ఐసోగోనిక్ రేఖలు
2 ) ఐసోక్లినిక్ రేఖలు
3 ) అయస్కాంత యామ్యోత్తర రేఖ
4 ) పైవన్నీ
ANSWERS
1-1 2-2 3-2 4-4 5-1 6-2 7-4 8-3
9-3 10-2 11-3 12-4 13-3 14-4
15-2 16-3 17-2 18-1 19-3 20-2
21-1 22-2 23-4 24-4 25-4