1. సుప్రీంకోర్ట్ రాష్ట్రపతికి ఏ విధంగా చట్ట లేదా వాస్తవ అంశంపై సలహా ఇస్తుంది ? జవాబు.2
1 ) తనకు తానే స్వతహాగా
2 ) రాష్ట్రపతి సలహా కోరినప్పుడు మాత్రమే
3 ) పౌరుల ప్రాథమిక హక్కులకు సంబం ధించిన అంశం అయినప్పుడు మాత్రమే
4 ) దేశసమగ్రతకు , సమైక్యతకు భంగం కలిగించే అంశం అయినప్పుడు
2. కింది వారిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టకుండానే ప్రధానమంత్రిగా ఎన్నికైనవారు ? జవాబు.3
ఎ . మొరార్జీ దేశాయ్
బి . చరణ్ సింగ్
సి . వీపీ సింగ్
డి . చంద్రశేఖర్
1. ఎ , సి 2. ఎ , బి 3. ఎ , బి , సి , డి 4 బి , సి , డి
3. కింది వాటిలో దేని ఆధారంగా భారత రాజ్యాంగాన్ని సమాఖ్య అని నిర్ణయించవచ్చు ? జవాబు.4
1 ) లిఖిత , దృఢ రాజ్యాంగం
2 ) అవశిష్ట అధికారాలు కేంద్రానికి కల్పించారు
3 ) స్వతంత్ర న్యాయవ్యవస్థ
4 ) కేంద్ర , రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ
4. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి సరైనది ? జవాబు.1
1 ) ఎన్నికల అనంతరం ఓటర్లు ఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారో అంచనాను ఊహించి విధానాన్ని వివరించడానికి ఉప యోగిస్తారు
2 ) ఎగ్జిట్ పోల్ , ఎన్నికల అభిప్రాయం రెండూ ఒకటే , సమానం
3 ) ఎగ్జిట్ పోల్ అనే సాధనం ద్వారా ఎన్నికల ఫలితాలను దాదాపుగా కచ్చితంగా ఊహించవచ్చు 4 ) భారత ఎన్నికల కమిషన్ ఎగ్జిట్ పోల్ అనే పాలనాపరమైన సాధనాన్ని కొంతకాలం ముందు మారు ఓటర్లను నియంత్రిం చడానికి తయారుచేసింది
5. ప్రధానమంత్రి పార్లమెంట్ ఎగువసభ సభ్యుడయితే ? జవాబు.1
1 ) అవిశ్వాస తీర్మానంలో అతడు తనకు అనుకూలంగా ఓటువేయరాదు
2 ) దిగువ సభలో బడ్జెట్ చర్చల్లో మాట్లాడేందుకు వీలులేదు
3 ) ఎగువసభల్లో మాత్రమే ప్రకటనలు ఇవ్వాలి
4 ) ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల వ్యవధిలో దిగువసభకు సభ్యుడిగా ఎన్నిక కావాలి
6. కేంద్ర జాబితాలోని ఏ అంశానికి సంబధిం చిన వాటికి సుప్రీంకోర్ట్ అధికార పరిధిని విస్తరింపజేసే శాసన అధికారం ఉంది ? జవాబు.3
1 ) రాష్ట్రపతి
2 ) ప్రధానన్యాయమూర్తి
3 ) పార్లమెంట్
4 ) కంపెనీ వ్యవహారాలు , న్యాయ , చట్ట మంత్రిత్వశాఖ
7. కింది ఏబిల్లును పార్లమెంట్ రెండు సభలు ప్రత్యేక మెజార్టీతో వేర్వేరుగా ఆమోదించాలి ? జవాబు.4
1 ) సాధారణ బిల్లు
2 ) ద్రవ్య బిల్లు
3 ) ఆర్థికబిల్లు
4 ) రాజ్యాంగ సవరణ బిల్లు
8. రాజ్యాంగంలో 7 వ షెడ్యూల్ లోని కేంద్రజా బితాలో కింది వాటిలో ఏ అంశం ఉన్నది ? జవాబు1
1 ) గనులు , చమురు క్షేత్రాల్లో కార్మికుల భద్రతా చర్యల నియంత్రణ
2 ) వ్యవసాయం
3 ) మత్స్య పరిశ్రమ
4 ) ప్రజారోగ్యం
9. ప్రతిపాదన ( ఏ ) : దేశంలో ప్రతి రాష్ట్రం తన భూభాగంలో హైకోర్టును కలిగి ఉంది హేతువు ( ఆది ) : రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పరిచింది? జవాబు.4
1 ) ఏ , ఆర్ విడివిడిగా సరైనవి . ఆర్ ఏకు సరైన వివరణ
2 ) ఏ , ఆర్ విడివిడిగా సరైనవి . ఆర్ , ఏకు సరైన వివరణ కాదు
3 ) ఏ సరైనది , ఆర్ తప్పు
4 ) ఏ తప్పు , ఆర్ సరైనది
10. భారత న్యాయవ్యవస్థలో ప్రజాప్రయోజన వ్యాజ్యం ( PIL ) ప్రవేశపెట్టినప్పుడు మొట్ట మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? జవాబు.4
1 ) జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా
2 ) ఏఎం అహ్మదీ
3 ) ఏఎస్ ఆనంద్
4 ) జస్టిస్ పీఎన్ భగవతి
11. కింది వాటిలో రాష్ట్రపతి పదవి నిర్వహించనివారు ? జవాబు.2
1 ) మహమ్మద్ హిదాయతుల్లా
2 ) ఫకృద్దీన్ అలీ అహ్మద్
3 ) నీలం సంజీవరెడ్డి
4 ) శంకర్ దయాళ్ శర్మ
12. కింది వివరణల్లో సరైనవి ? జవాబు.1
ఎ . ప్రభుత్వ ఖాతాల కమిటీ చైర్మన్ని లోకసభ స్పీకర్ నియమిస్తారు
బి . ప్రభుత్వ ఖాతాల కమిటీలో రాజ్యసభ సభ్యులు , పారిశ్రామిక , వ్యాపార రంగానికి చెందినవారు సభ్యులుగా ఉంటారు
1 ) ఎ 2 ) బి 3 ) ఎ , బి 4 ) ఏదీకాదు
13. కింది ఏ సంస్కరణల కోసం వీరప్పమొయి లీ అధ్యక్షతన కమిషన్‌ను నియమించారు ? జవాబు.4
1 ) పోలీస్ సంస్కరణలు
2 ) పన్ను సంస్కరణలు
3 ) సాంకేతిక విద్యాసంస్కరణలు
4 ) పరిపాలన సంస్కరణలు
14. రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకుని కింది అంశాలను పరిశీంచండి ? జవాబు.2
ఎ . ప్రాథమిక హక్కులు
బి . ప్రాథమిక విధులు
సి . ఆదేశిక సూత్రాలు పైన పేర్కొన్న రాజ్యాంగంలోని ఏ అంశం / అంశాలు భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ సామాజిక సహాయ పథకానికి తోడ్పడుతుంది తోడ్పడుతాయి
1 ) ఎ 2 ) బి 3 ) ఎ , బి 4 ) ఎ , బి , సి
15. కేంద్ర ఆర్థికసంఘం చేసిన ప్రతి సిఫార్సును ఎవరు పార్లమెంట్‌లో ప్రతిసభ ముందు ఉండేటట్లు చూస్తారు ? జవాబు.1
1 ) రాష్ట్రపతి
2 ) లోక్ సభ స్పీకర్
3 ) ప్రధానమంత్రి
4 ) కేంద్ర ఆర్థికమంత్రి
16. కింది వివరణలు పరిశీంచండి ? జవాబు.4
ఎ ) రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాలకు పాతినిధ్యం లేదు .
బి ) ఎన్నిక వివాదాల న్యాయనిర్ణయం ప్రధాన ఎన్నికల కమిషనర్ పరిధిలో ఉంటుంది
సి ) రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో లోకసభ , రాజ్యసభ మాత్రమే ఉంటాయి
1 ) ఎ 2 ) బి , సి 3 ) ఎ , సి 4 ) ఏదీకాదు
17. పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ధ్యేయం ? జవాబు. 1
1 ) అత్యంత ప్రజా ప్రాముఖ్యం గల ఒక నిర్దిష్ట విషయంపై చర్చని ఆమోదించటం
2 ) మంత్రుల నుంచి సమాచారాన్ని పొందడానికి ప్రతిపక్ష సభ్యులను అనుమతించడం
3 ) గ్రాంట్ కోసం ఉన్న డిమాండ్ లో ఒక నిర్దిష్ట మొత్తాన్ని తగ్గించడానికి అనుమతినివ్వడం
4 ) కొంతమంది సభ్యుల అనుచితమైన , హింసాయుతమైన ప్రవర్తనను నిరోధించడానికి కార్యక్రమాలను వాయిదా వేయడం
18.కింది వారిలో జాతీయ అభివృద్ధిమండ లిలో ఎవరు ఉంటారు ? జవాబు.2
ఎ . ప్రధానమంత్రి
బి . కేంద్ర ఆర్థికసంఘం ఛైర్మన్
సి . కేంద్ర కేబినెట్ మంత్రులు
డి . రాష్ట్రాల ముఖ్యమంత్రులు
1 ) ఎ , బి , సి 2 ) ఎ , సి , డి 3 ) బి , డి 4 ) ఎ , బి , సి , డి
19. రాజ్యాంగం ప్రకారం కింది దేనిని దేశపాల నకు ప్రాథమికం అని పేర్కొనవచ్చు ? జవాబు.3
1 ) ప్రాథమిక హక్కులు
2 ) ప్రాథమిక విధులు
3 ) ఆదేశిక సూత్రాలు
4 ) ప్రాథమిక హక్కులు , విధులు
20. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచాయతీ విస్తృతి ( PESA ) చట్టం -1998 ని ప్రభుత్వం ఆమోదించింది . కింది వాటిలో ఈ చట్టం ఆశయం కానిది ? జవాబు.3
1 ) స్వపరిపాలనను ఏర్పాటు చేయడం
2 ) సాంప్రదాయక హక్కులను గుర్తించడం
3 ) ఆదివాసీ ప్రాంతాల్లో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతాలను ఏర్పాటు చేయడం
4 ) దోపిడీ నుంచి ఆదివాసీలను కాపాడటం