Hot Widget

Type Here to Get Search Results !

పర్యాటక ప్రాంతాలు బిట్స్.. ( ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


దేశంలోని కొన్ని ప్రముఖ పర్యటక ప్రాంతాలు

 * జిరో ( Ziro ) - అరుణాచల్ ప్రదేశ్ : ఎత్తయిన ప్రాంతంలో చేపల పెంపకం , వరిసాగు , లోయ వన్య ప్రాణి కేంద్రాలు

 * మెక్లియోడ్ గంజ్ ( McLeod Ganj ) హిమాచల్ ప్రదేశ్ : దలైలామా ఆధ్యాత్మిక ప్రాంతం . దీన్నే లిటిల్ లాసా అంటారు . 

* బోధ్ గయ ( Bodh Gaya ) - బిహార్ : బుద్ధుడి ధ్యాన విగ్రహం , మహాబోధి వృక్షం . దీన్నే లాండ్ ఆఫ్ నిర్వాణ అంటారు .

 * మజులీ ( Majuli ) - అసోం : ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి ద్వీపం .

 * కచ్ ( Kutch ) - గుజరాత్ : భారతదేశపు తెలుపు ఏడారిగా పేరుగాంచింది .

 * లేహ్ ( Leh ) - లద్దాఫ్ : ప్యాంగాంగ్ సరస్సు , జస్కర్ లోయ . ఇండియాస్ ఓన్ మూ vండ్ అని అంటారు .

 * అలెప్పీ ( Alleppey ) - కేరళ : సముద్ర వెనుక జలాలు , బీచ్లు , లాగూన్స్ మొదలైనవి . దీన్నే వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు . 

* దంతెవాడ ( Dantewada ) - చత్తీస్ ఘడ్ : దంతేశ్వరీ దేవాలయం , ఇంద్రావతి జాతీయ పార్క్ దీన్నే ద మక్కా ఆఫ్ ఆఫ్ బీట్ టూరిజం అంటారు .

 * హంపి ( Hampi ) - కర్ణాటక : రమణీయమైన ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం . విరూపాక్ష దేవాలయం , లోటస్ ప్యాలెస్ ప్రసిద్ధి . 

* కుంచికల్ ( Kunchikal ) - కర్ణాటక : దేశంలో అత్యంత ఎత్తయిన జలపాతం . ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా .

 * జైసల్మేర్ ( Jaisalmer ) - రాజస్థాన్ : ఎడారి సఫారీ , జైసల్మేర్ కోట ప్రసిద్ధి . దీన్నే గోల్డెన్ సిటీ అని అంటారు .

 * పుష్పలోయ ( Valley of flowers ) - ఉత్తరాఖండ్ : అందమైన పుష్పాలలోయ , నందాదేవి జాతీయ పార్క్ ఇక్కడి నిర్మలమైన లోయ పువ్వులకు ప్రసిద్ధి .

 * హైదరాబాద్ - తెలంగాణ : చార్మినార్ , గోల్కొండ , ఫలక్ నుమా ప్యాలెస్ , హుస్సేన్ సాగర్ . దీన్నే సిటీ ఆఫ్ నిజాం అంటారు .

 * వారణాసి ( Varanasi ) - ఉత్తర్ ప్రదేశ్ : బెనారస్ గా పేరుపొందింది . కాశీ విశ్వనాథ దేవాలయం , భారత దేశ ఆధ్యాత్మిక రాజధాని . 

* భందార ( Bhandardara ) - మహారాష్ట్ర : అంబ రిల్లా జలపాతం , కల్సుబై శిఖరం , విల్సన్ డ్యామ్ ప్రసిద్ధిగాంచాయి . 

* బొర్రా గుహలు - ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్టణంలోని బొర్రా గుహలు , అరకు , లంబసింగి శీతల ప్రాంతం , కర్నూలులోని బెలూమ్ గుహలు . 

* కన్యాకుమారి - తమిళనాడు : భారతదేశానికి దక్షిణపు చివరి కొన , అందమైన బీచ్ , వర్ణరంజితమైన సూర్యోదయం , సూర్యాస్తమయం .. 

* ఆగ్రా ( Agra ) ఉత్తర్ ప్రదేశ్ : యమునా నది తీరంలో ఉంది . ప్రజాదరణ పొందిన పర్యటక కేంద్రం . ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన ' తాజ్ మహల్ ' ఉన్న నగరం . యునెస్కో గుర్తింపు పొందింది . 

* ఉదయ్ పూర్ ( Udaipur ) రాజస్థాన్ : దీన్ని ' సరస్సుల నగరం ' అని పిలుస్తారు . ఈ నగరం చుట్టూ అన్ని దిశల్లో అందమైన ఆరావళి పర్వత కొండలు ఉన్నాయి . అలాగే దీన్ని రాజస్థాన్ రాష్ట్ర కిరీట ఆభ రణం అంటారు . 

* దిల్లీ ( Dehli ) దిల్లీ : భారతదేశ రాజధాని , కాస్మోపాలి టన్ నగరం అని కూడా పిలుస్తారు . ప్రసిద్ధి చెందిన పార్లమెంట్ , జంతర్ మంతర్ , ఎర్రకోట , ఇండియా గేట్ ముఖ్యమైన ప్రాంతాలు . 

* మున్నార్ ( Munnar ) కేరళ : పశ్చిమ కనుమల్లో 1600 మీటర్ల ఎత్తులో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రం . దీన్నే ' కశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా ' అని పిలుస్తారు .

* జోధ్ పూర్ ( Jodhpur ) రాజస్థాన్ : దీన్నే ' బ్లూ సిటీ ' ' సన్ సిటీ ' , ' థార్ ఎడారి ముఖద్వారం ' అని పిలుస్తారు . ఇక్కడ బహుళ దేవాలయాలు , సరస్సులు ఉన్నాయి . వాణిజ్య , వ్యాపార వీధులకు ప్రసిద్ధి .

 * శ్రీనగర్ ( Srinagar ) జమ్మూ కశ్మీర్ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ రాజధాని . దీన్నే ' హెవెన్ ఆన్ ఎర్త్ ' అని పిలుస్తారు . జీలం నది ఒడ్డున ఉంది . ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు , ఊలార్ మంచినీటి సర స్సులు ఇక్కడే ఉన్నాయి .

 * ఖజురహో ( Khajuraho ) మధ్యప్రదేశ్ : యునెస్కో హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది . సంస్కృతి నిర్మాణంలో ప్రసిద్ధి చెంది శృంగార , ఇంద్రియ శిల్పా లకు పేరుపొందింది . 

* వైష్ణవి దేవి ( Vaishno Devi ) జమ్మూ కశ్మీర్ : ద హోలీ కేవ్స్ ( The Holy caves ) . దుర్గ రూపంలో ఉన్న హిందువుల ప్రధాన దేవత . ఈమెను మాతారా ణిగా పేర్కొంటారు . ఇక్కడ మూడు రూపాలైన మహాకాళి , మహా సరస్వతి , మహాలక్ష్మి ప్రసిద్ధిగాంచాయి . 

* అండమాన్ - అండమాన్ నికోబార్ ( కేంద్రపాలిత ప్రాంతం ) : ఇది 572 దీవుల సమూహం . 37 దీవుల్లో జనావాసాలు ఉంటాయి . ఈ దీవులు మణి నీలం జలాల మడుగులకు ప్రసిద్ధి .


Top Post Ad

Below Post Ad