రైళ్లు - ప్రత్యేకతలు
• వివేక్ ఎక్స్ ప్రెస్ : ఇది దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు . కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణిస్తుంది .
• నాగ్ పూర్ - అజ్నీ : దేశంలో అత్యల్ప దూరం ( 3 కి.మీ. ) ప్రయాణించే రైలు నాగ్ పూర్ - అజ్నీ ప్యాసిం జర్ రైలు .
• గతిమాన్ : దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు గతిమాన్ . ఇది గంటకు 160 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ - ఆగ్రా మధ్య నడుస్తుంది .
• నీలగిరి : దేశంలో అత్యల్ప వేగంతో ప్రయాణించే రైలు నీలగిరి . ఇది గంటకు 10 కి.మీ. వేగంతో మొట్టుపాలెం ఊటీ మధ్య నడుస్తుంది .
• త్రివేండ్రం రాజధాని ఎక్స్ ప్రెస్ : ఎక్కడ ఆగకుండా ఎక్కువ దూరం నడిచే రైలు . ఇది వడోదర - కోటాల మధ్య 528 కి.మీ ( 6 గంటల 55 నిమిషాలు ) ప్రయా ణిస్తుంది .
• హౌరా - అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ : ఎక్కువ స్టేషన్లలో ఆగే ఎక్స్ ప్రెస్ . ఇది మొత్తం 115 చోట్ల ఆగుతుంది .
• జీవన్ రేఖ : గ్రామీణ ప్రజల వైద్య అవసరాల కోసం ప్రపంచంలో మొదటిసారిగా 1991 , జూలై 16 న ముంబైలో ఏర్పాటు చేశారు .
• ధన్వంతరి : రోగులకు మందులు ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు . & AOZ
• ప్యాలెస్ ఆన్ రైలు : పర్యాటక రంగం కోసం ఏర్పాటు చేశారు .
• గోల్డెన్ చారియట్ : కర్ణాటకలోని పర్యాటక ప్రాంతా లను సందర్శించడానికి ఏర్పాటుచేశారు .
• దక్కన్ ఒడిస్సీ : మహారాష్ట్ర , గోవా పర్యాటక ప్రాంతాల సందర్శించడానికి ఏర్పాటు చేశారు .
• రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ : ఎయిడ్స్ పై అవగాహన , ప్రచారం , చికిత్స కోసం ఏర్పాటు చేశారు .
• సైన్స్ ఎక్స్ ప్రెస్ : సైన్స్ , సాంకేతిక రంగాలు , పర్యావ రణం గురించి తెలపడానికి
• గరీబ్ రథ్ : పేద , మధ్య తరగతి ప్రజల కోసం 2010 లో ప్రారంభించారు .
• కిసాన్ రైలు : రైతులు పండించిన పంటను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఖర్చు రవాణా చేసు కోవడానికి ఈ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020 ఆగస్ట్ 7 న మహారాష్ట్రలో ప్రారంభిం చారు . ఇది మహారాష్ట్రలోని దేవీలాల్ నుంచి బయ లుదేరి 14 స్టేషన్లు ప్రయాణించి బీహార్ లోని ధన్ బాద్కు చేరుతుంది .