1. సుప్రీంకోర్ట్ సలహ అధికార పరిధికి సంబం ధించి కిందివాటిలో ఏ వివరణ సరైనది ? జవాబు-3
ఎ . రాష్ట్రపతి ద్వారా సంప్రదించిన ఏ అంశ మైనా సుప్రీంకోర్ట్ తన అభిప్రాయాన్ని వెలి బుచ్చే కట్టుబాటు ఉంది.
బి . సుప్రీంకోర్ట్ సలహా అధికార పరిధికి సంప్రదించిన ప్రతి అంశాన్ని పూర్ణ ధర్మాసనం ద్వారా స్వీకరిస్తుంది సి . సుప్రీంకోర్ట్ సలహా అధికార పరిధికి లోబడి వెలిబుచ్చిన అభిప్రాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉండనవసరం లేదు.
డి ) ఏకాకలంలో ఒకటికి మించి అంశాలను , సుప్రీంకోర్ట్ సలహా అధికార పరిధి కింద అభి ప్రాయం కోసం ప్రతిపాదించకూడదు.
1 ) ఎ , బి 2 ) ఎ , సి 3 ) బి , సి 4 ) బి , డి
2. కింది వాటిలో ఒకటి సుప్రీంకోర్ట్ , హైకోర్టు రెండింటి అధికార పరిధిలోకి వస్తుంది ? జవాబు-3
1 ) కేంద్రం , రాష్ట్రాల మధ్య వివాదాలు
2 ) రాష్ట్రాల మధ్య వివాదాలు
3 ) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
4 ) రాజ్యాంగ అతిక్రమానికి వ్యతిరేకంగా పరిరక్షణ
3 . 1979 లో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన రాష్ట్రం ? జవాబు-4
1 ) కేరళ
2 ) జమ్ముకశ్మీర్
3 ) పశ్చిమబెంగాల్
4 ) తమిళనాడు
4. కిందివాటిలో రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశం ? జవాబు-1
1 ) జనాభా , కుటుంబ నియంత్రణ
2 ) ప్రజారోగ్యం , పారిశుద్ధ్యం
3 ) కేపిటేషన్ పన్నులు
4 ) గుప్తనిధి
5. రాష్ట్రపతి ఎన్నికలో సీఎం ఓటు వేయడానికి కింది ఏ దారణంగా అద్పుడు కాదు ? జవాబు-3
1 ) తనకు తానే రాష్ట్రపతి అభ్యర్థి అయితే
2 ) అతడు తన మెజార్టీ మద్దతును ఇంకా రాష్ట్ర విధానసభలో నిరూపించుకోనప్పుడు
3 ) రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభ నుంచి ఎన్నికైన సభ్యుడు అయితే
4 ) అతడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయితే
6. కేంద్రం , రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించే సుప్రీంకోర్ట్ అధికార పరిధి దేని కిందకు వస్తుంది ? జవాబు-3
1 ) సలహా అధికార పరిధి
2 ) అప్పిలేట్ అధికార పరిధి
3 ) ప్రారంభ అధికార పరిధి
4 ) రాజ్యాంగ అధికార పరిధి
7. కింది వాక్యాల్లో సరైనది ? జవాబు-4
ప్రతిపాదన ( ఏ ) : బ్రిటీష్ సార్వభౌమాధికారం స్వతంత్ర భారత్ లో కూడా కొనసాగుతుంది
హేతువు ( ఆర్ ) : బ్రిటీష్ సార్వభౌమాధికారి భారత చివరి గవర్నర్ జనరల్ ని నియమించారు
1 ) ఏ , ఆర్ సరైనవి . ఆరకు ఏసరైన వివరణ
2 ) ఏ , ఆర్ సరైనవి . కానీ ఆర్ ఏకు సరైన వివరణ కాదు .
3 ) ఏసరైనది , ఆ తప్పు
4 ) ఏ తప్పు , ఆర్ సరైనది
8. కింది వాటిలో ఏది రాష్ట్రపతి ఎన్నికల్లో భాగం అయినప్పటికీ , అభిశంసనలో భాగంగా ఉండదు ? జవాబు-4
1 ) లోక్సభ
2 ) రాజ్యసభ
3 ) రాష్ట్ర విధాన పరిషత్లు
4 ) రాష్ట్ర విధాన సభలు
9. పంచాయతీరాజ్ ఏర్పాటులో ఎటువంటి పాలనా వ్యవస్థ ఉంది ? జవాబు-3
1 ) గ్రామస్థాయిలో ఒక అంచె నిర్మాణంగా గల స్థానిక వ్యవస్థ
2 ) గ్రామం , బ్లాక్ స్థాయిలో రెండంచెల నిర్మాణంగా స్థానిక వ్యవస్థ
3 ) గ్రామం , బ్లాక్ , జిల్లాస్థాయిలో మూడం చెల నిర్మాణంగా గల స్థానిక వ్యవస్థ
4 ) గ్రామం , బ్లాక్ , జిల్లా , రాష్ట్రస్థాయిలో నాలుగంచెల నిర్మాణంగా గల స్థానిక వ్యవస్థ
10. రాజ్యాంగం కిందివాటిలో దేనిని ప్రస్తావించినది ? జవాబు-2
ఎ . రాష్ట్రపతి- పార్లమెంట్ ఉభయసభల్లో దేనిలోనూ సభ్యుడై ఉండరాదు
బి . పార్లమెంట్- రాష్ట్రపతి , రెండు సభలతో కూడుకొని ఉంది
1 ) ఎ , బి సరికాదు 2 ) ఎ , బి సరైనవి 3 ) ఎ మాత్రమే 4 ) బి మాత్రమే
11. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ప్రాథ మికస్థాయి విద్యను మాతృభాషలో అందిం చడానికి ప్రతి రాష్ట్రం కావల్సిన వసతులను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది ? జవాబు-3
1 ) ప్రకరణ 34 ఎ
2 ) ప్రకరణ 35 డి
3 ) ప్రకరణ 350 ఎ
4 ) ప్రకరణ 351
12. ద్రవ్య బిల్లుకు సంబంధించి కింది వాటిలో ఏదో ఒక వాక్యం అసత్యం అది ఏది ? జవాబు-1
1 ) ద్రవ్యబిల్లును పార్లమెంట్ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
2 ) లోకసభ స్పీకర్ అంతిమ అధికారి .. ద్రవ్యబిల్లు అవునా కాదా అని నిర్ణయించండంలో
3 ) లోకసభ ఆమోదించిన రాజ్యసభకు పంపిచిన ద్రవ్యబిల్లును 14 రోజుల వ్యవధిలో తిరిగి పంపించాలి 4 ) రాష్ట్రపతి ద్రవ్యబిల్లును పునరాలోచనకు పంపించే వీలులేదు.