ఉద్యోగం ఖాళీలు::
1 ) రెవెన్యుశాఖలో , రిజిస్ట్రేషన్ శాఖలో , సర్వే డిపార్ట్మెంట్ లో అన్ని కేటగిరిలతో కలిసి 12 వేల పోస్టులు ఖాళీగా యున్నవి . తహశీల్దారు ఆఫీసు లలో , ఆర్ డి ఒ ఆఫీసులలో క్లర్కులు , కంప్యుటర్ ఆప రేటర్స్ లేక ప్రజల పనులు జరుగడం లేదు . విద్యా ర్థులకు కులం , ఆదాయం సర్టిఫికెట్లు ఇచ్చే దిక్కు లేదు . అలాగే 23 కొత్త జిల్లాలు , 131 మండలాలు , 30 రెవెన్యు డివిజన్లు ఏర్పాటు చేశారు . కాని ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు . సర్వే డిపార్ట్ మెంట్ లో సర్వేయర్లు లేక రైతులు రోజు భూతగాదాలు పరిష్కరించుకోలేక కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు .
2 ) వైద్య - ఆరోగ్య శాఖలో 23 వేల పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారు . కోవిడ్ 19 మహమ్మారి వస్తే కూడా ఖాళీ ఉద్యో గాలు భర్తీ చేయడం లేదు . కోవిల్ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు , నర్సులు , ల్యాబ్ టెక్నీషియన్స్ , పారా మెడికల్ సిబ్బంది సరిపోను లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశాం . దీనితో ప్రభుత్వ అసమర్ధత తేలిపోయింది . ప్రభుత్వం ఈ మధ్య కొత్త పథకాలు కూడా పెట్టింది . కంటివెలుగు , కెసి ఆర్ మెడికల్ కిట్ వంటి పథకాలు పెట్టారు . అలాగే కొత్త డిస్పెన్సరీలు ప్రారంభించారు . కాని డాక్టర్లు , నర్సులు , టెక్నీషియన్ , పారామెడికల్ సిబ్బంది లేకుండా ఆరోగ్య శాఖ ఎలా నడుస్తుంది .
3 ) పంచాయత్ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలో 12 వేల పోస్టులు భర్తీ చేయవలిసియుంది . కొత్తగా 4383 గ్రామ పంచాయితీలు మంజూరు చేశారు . కాని ఒక్క అదనపు పోస్టు భర్తీ చేయలేదు . సిబ్బంది లేకుండా కొత్త గ్రామపంచాయితీలు ఏర్పాటు చేసి ఏం ఉపయోగం . పంచాయత్ రాజ్ శాఖ గ్రామాల అభివృద్ధికి కీలకమైన శాఖ . గ్రామీణస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పూర్తిస్థాయి సిబ్బందితో ఈ శాఖ ను పటిష్టం చేసినపుడే గ్రామాలు అభివృద్ధి చెందుతా యి . గ్రామపాలన అభివృద్ధి సజావుగా సాగుతుంది .
4 ) మున్సిపాలిటీలలో , మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కేటగిరిలలో 18 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి . మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండడంతో పరిపాలన సామర్థ్యం దెబ్బతింది . మున్సిపల్ వర్కులు దెబ్బతింటున్నాయి . అలాగే కొత్తగా 76 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పోరే షన్లు ఏర్పాటు చేశారు . కాని ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా అదనంగా భర్తీ చేయలేదు . సిబ్బంది లేక మున్సిపల్ పట్టణంలో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఈ ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేయవలసిన అవసరం ఉంది .
5 ) ప్రభుత్వ పాఠశాలలలో 40 వేల టీచర్ పోస్టు లు , 10 వేల పిఇటి పోస్టులు , 5 వేల ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టులు , 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు , 10 వేల క్లరికల్ పోస్టులు , 3 వేల లైబ్రేరియెన్ పోస్టులు ఖాళీగా యున్నవి . అలాగే 4900 ఎయిడెడ్ స్కూల్ టీచర్ పోస్టులు , 2 వేల మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు , 1500 కస్తూర్బ టీచర్ పోస్టులు , గురుకులాల్లో మరో 4 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయవలిసి ఉంది . రాష్ట్రంలో విద్యావ్య వస్థ రోజు , రోజు నిర్వీర్యమవుతుంది . టీచర్ పోస్టు లు భర్తీ చేయకపోవడంతో పాఠశాలల్లో విద్యాప్రమా ణాలు దెబ్బతింటున్నాయి . ప్రభుత్వం మండల విద్యాశాఖ అధికారులను నియమించడం లేదు . 589 మండల ఎంఇఒ లకు కేవలం 25 పోస్టుల్లో మాత్రమే పనిచేస్తున్నారు . అంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చూడండి . విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం ప్రత్యక్షంగా పరో క్షంగా సమాజం మీద తీవ్రంగా ఉంటుంది .
6 ) ఉన్నత విద్యలో జూనియర్ కాలేజీలలో 4800 జూనియర్ లెక్చరర్స్ , 2 వేల డిగ్రీ కాలేజీ లెక్చరర్ , 900 పాలిటెక్నిక్ , ఐటిఐ లెక్చరర్ పోస్టు లు , డైట్ లెక్చరర్ పోస్టులు , 2200 యూనివర్సిటీల అసి స్టెంట్ టీచర్ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు . యూనివర్సిటీలలో వైస్ చాన్సలర్లను నియ మించకుండ , కాలేజీలలో లెక్చరర్లను నియమించ కుండ యూనివర్సిటీ విద్యావ్యవస్థను దిగజారుస్తు న్నారు . యూనివర్సిటీలు నిర్వీర్యమై పోయాయి . రిసెర్చ్ దెబ్బతింటుంది . ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలలో విద్యా ప్రమాణాలు అడుగంటి పోయా యి . ఎయిడెడ్ కాలేజీలు మూత పడే స్థితికి వచ్చాయి . వీటికి నోటిఫికేషన్ జారీ చేయాలి.
7 ) SC / ST / BC / మైనార్టీ / మహిళా - శిశు సంక్షేమ , యువజన సంక్షేమ శాఖలలో దాదాపు 18 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి . హాస్టళ్ళలో వార్డెన్లు లేక , వర్కర్లు లేక విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నా యి . గురుకుల పాఠశాలల్లో టీచర్లు లేక విద్య ప్రమా ణాలు దెబ్బతింటున్నాయి . కావున వీటిని వెంటనే భర్తీ చేయాలి .
8 ) వ్యవసాయ శాఖ , సహకార శాఖ , ఉద్యానవన శాఖలలో కూడా దాదాపు 8 వేలకు పైగా ఖాళీ లు ఉన్నవి . ఏళ్ళ తరబడి ఈ శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఈ శాఖలు బలహీన పడి పోయి నవి .
9 ) హోం శాఖ , జైళ్ళ శాఖ దాని అనుబంధ శాఖ లలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు , SIDSP , క్లరికల్ పోస్టులు , ఇతర పోస్టులు కలిపి 29 వేల ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదు . వందలాది కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు . కాని కొత్త పోస్టులు భర్తీ చేయడం లేదు .
10 ) ఇరిగేషన్ , రోడ్లు , భవనాలు , పంచాయిత్ రాజ్ , మున్సిపల్ , గిరిజన తదితర శాఖలలో 4 వేల ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రభు త్వ పనులలో జాప్యం జరుగుతుంది . నిర్మాణ కార్యక్రమాలలో నాణ్యత దెబ్బతింటుంది . కావున వెంట నే ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయాలి .
11 ) ఇరిగేషన్ , రోడ్లు- భవనాల శాఖలో నాటె క్నికల్ పోస్టులు 2 వేల వరకు ఖాళీలు ఉన్నాయి .
12 ) విద్యుత్ శాఖలో 25 వేల పోస్టులు ఖాళీగా యున్నవి . వీటిని వెంటనే భర్తీ చేయాలి . విద్యుత్ శాఖ ఎంతో ప్రాధాన్యత గల సాంకేతిక శాఖ . కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మంజూరు చేశారు . కాని సిబ్బందిని నియమించడం లేదు . దీనిలో సరిపోను సిబ్బంది లేకపోతే మౌలిక అభివృద్ధి రంగాలైన వ్యవ సాయం , పారిశ్రామిక , I.T రంగాలు దెబ్బతింటాయి .
13 ) ట్రాన్స్ పోర్ట్ , RTC లో 15 వేల ఖాళీలు యున్నవి . వాటిని వెంటనే భర్తీ చేయాలి .
14 ) అటవీ శాఖ ద్వారా హరిత హారం కార్యక్ర మాన్ని ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టింది . చాలా హర్షించదగ్గ విషయం . కాని ఈ శాఖలో సరిపోను సిబ్బంది లేదు . దాదాపు 4 వేల వేకెన్సీలు ఉన్నట్టు శాఖ వారు తెలుపుతున్నారు . వీటి భర్తకై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి .
15 ) ఎక్సైజు , వాణిజ్య పన్నులు , దేవాదాయ శాఖ లలో దాదాపు 6 వేల ఖాళీలు ఉన్నట్లు అధికార వర్గా ల ద్వారా తెలుస్తుంది . ఈ శాఖను బలోపేతం చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది .
16 ) గ్రూపు -1 సర్వీస్ క్రింద డైరెక్టు రిక్రూట్ మెంట్ కోటా క్రింద గత 10 సం.రాలుగా వస్తున్న ఖాళీలు 1600 ఉద్యోగాల ఖాళీలు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయవలిసి ఉంది . గ్రూపు 1 కేటగిరి క్రింద 18 సర్వీసులలో దాదాపు 1600 ఉద్యోగాల ఖాళీ లు ఉన్నాయి . ఇందులో డిప్యూటీ కలెక్టర్స్ , DSP ( పోలీస్ ) , C.T. ) , రిజిస్ట్రార్ తదితర 18 శాఖల పోస్టులు ఉన్నవి . గత 10 సం.రాలుగా గ్రూప్ నోటిఫికేషన్ జారి చేయలేదు . ఇంత తీవ్ర జాప్యం గతంలో ఎప్పుడు జరుగలేదు . ప్రక్క రాష్ట్రమైన A.P లో రెండుసార్లు , కర్ణాటకలో ప్రతియేటా గ్రూప్ నోటిఫికేషన్ జారి చేస్తున్నారు . కాని మన రాష్ట్రంలో నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో రాత్రింబ వళ్ళు చదువుతు కోచింగ్ కు వెళుతూ ప్రిపేర్ అవు తున్నారు . యువతరాన్ని కొత్తరక్తాన్ని పాలనలో భాగస్వాములుగా చేస్తే పరిపాలన సమర్థవంతంగా , నిజాయితిగా జరుగుతుంది . కావున వెంటనే నోటిఫి కేషన్ జారి చేయవలిసిన అవసరం ఉంది .
17 ) 14 ప్రభుత్వ శాఖలలో డైరెక్టు రిక్రూట్ మెంట్ కోటా క్రింద వచ్చే గ్రూపు 2 ఉద్యోగాలు 4 వేలు ఉన్నవి ! గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాలు చాల ముఖ్యమై నవి . కొత్త జిల్లాలు మండలాలు వచ్చిన తర్వాత గ్రూప్ 2 సర్వీస్ పోస్టులు భర్తీ చేయలేదు . యువ తకు పాలనలో అవకాశం కల్పిస్తే అవినీతి తగ్గు తుంది . పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఏర్పడు తుంది . వీటి భర్తీ కై వెంటనే నోటిఫికేషన్ ను జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము .
18 ) గ్రూపు -3 సర్వీస్లో 8 వేలు ఖాళీలకు పైగా ఉన్నవి . ప్రత్యేకంగా సెక్రెటేరియట్ , ప్రభుత్వ డైరెక్ట రేట్ పంచాయత్ రాజ్ లలో పెద్ద యెత్తున ఖాళీలు ఉన్నవి . అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ కుర్చీలతో వెలవెల పోతున్నాయి .
19 ) గ్రూపు -4 సర్వీస్ క్రింద 40 వేల జూనియర్ అసిస్టెంట్ , కంప్యుటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి . ఈ పోస్టులు ప్రభుత్వాన్ని నడపడంలో కీల కమైనవి . ప్రతి పైలు జూనియర్ అసిస్టెంట్ ద్వారానే సృష్టించబడుతుంది . ఇట్లాంటి కీలకమైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సర్వీసు కమిషన్ ద్వార భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం బలహీన పడ్డది . జిల్లా , డివిజన్ , మండల స్థాయి ఆఫీసులలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గత 25 సంవత్సరా లుగా డైరెక్టు రిక్రూట్ మెంట్ పద్ధతిలో రిక్రూట్ మెంట్ చేయడం లేదు . కేవలం సెక్రెటేరియట్ , డైరెక్ట రేట్లలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు . జిల్లా తాలూకా ఆఫీసు లలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడం లేదు . అటెండర్లను ప్రమోషన్ల ద్వారా జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నారు . ఈ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిస్టం చేయాలనే స్పృహ పాలకులకు లేకపోతే ఎలా ?