Hot Widget

Type Here to Get Search Results !

భూగోళ శాస్త్రం బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. ఈ క్రింది వాటిని పరిశీలింపుము ప్రతిపాదన 

( A ) : భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది . కారణము 

( R ) : నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో పోలిస్తే విస్తృతి గల అరేబియా సముద్రం మీదుగా కదులుతాయి .

 A ) ( A ) మరియు ( R ) నిజమైనవి . ( A ) కి ( R ) సరైన వివరణ 

 B ) ( A ) మరియు ( R ) నిజమైనవి . ( A ) కి ( R ) సరైన వివరణ కాదు

 C ) ( A ) నిజమైనది ( R ) నిజమైనది కాదు

 D ) ( A ) నిజమైనది కాదు ( R ) నిజమైనది 


2. భారతదేశంలో దుర్భిక్షాలు మరియు వరదలు ఒక సాధారణ వాతావరణ ప్రక్రియలా ఉన్నాయి . కారణం :

 A ) దేశ భూభాగంలో సంవత్సరానికి , సంవత్సరానికి మధ్య ఋతుపవనాల విచలనము ఎక్కువగా ఉండటం వలన 

B ) దేశంలో ఋతుపవనాల కాల నిడివి తక్కువగా ఉన్నందున 

C ) దేశ భూ భాగంలో ఎక్కువ విస్తృతి కలిగి ఉన్నందున 

D ) దేశంలో వర్షచ్చాయ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున 


3. దుర్భిక్ష ప్రాంతాలలో వర్షపాత విచలనము ( rainfall variability ) ఎంతవరకు ఉంటుంది ? 

A ) 20 - 25 శాతం 

B ) 30 శాతం కన్నా ఎక్కువ 

C ) 15 శాతం కన్నా తక్కువ 

D ) 15 - 20 శాతం 


4. గంగా మైదాన ప్రాంతంలో వర్షపాత విస్తరణ రీతిని ఏవిధంగా పేర్కొనవచ్చు ? 

A ) తూర్పు నుండి పశ్చిమానికి వర్షపాత పరిమాణం తగ్గుతుంది 

B ) పశ్చిమం నుండి తూర్పుకు వర్షపాత పరిమాణం తగ్గుతుంది 

C ) తూర్పు నుండి పశ్చిమానికి వర్షపాత పరిమాణం పెరుగుతుంది 

D ) ఉత్తరం నుండి దక్షిణానికి వర్షపాత పరిమాణం తగ్గుతుంది 


5. ఈ క్రింది వాటిని పరిశీలింపుము . ప్రతిపాదన 

( A ) : జూన్ మొదటివారంలో దేశ భూ భాగంలో వాతావరణంలో తేమశాతం పెరిగి , ఉష్ణోగ్రతల 7 - 8 ° C తగ్గి అక్కడక్కడ ఉరుములు , మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది . కారణం 

( R ) : జూన్ మొదటివారంలో నైరుతి ఋతుపవనాలు క్రమక్రమంగా కాకుండా , ఆకస్మికంగా కేరళలోకి ప్రవేశిస్తాయి .

 A ) ( A ) మరియు ( R ) నిజమైనవి . ( A ) కి ( R ) సరైన వివరణ

 B ) ( A ) మరియు ( R ) నిజమైనవి . కాని ( A ) కి ( R ) సరైన వివరణ కాదు

 C ) ( A ) నిజమైనది ( R ) నిజమైనది కాదు

 D ) ( A ) నిజమైనది కాదు ( R ) నిజమైనది 


6. వేసవి ఋతుపవనాల వలన ఏ ప్రాంతంలో మొదటి వర్షపాతం సంభవిస్తుంది ? 

A ) పశ్చిమ కనుమలు 

B ) హిమాలయాలు 

C ) తూర్పు కనుమలు 

D ) గంగా - సింధు మైదానాలు 


7. రాజస్థాన్ లో ఋతుపవనాల వలన తక్కువ వర్షపాతం కాలగటానికి గల కారణం ఏమి ? 

A ) ఆరావళి పర్వతాలు ఋతుపవనాలు కదిలే దిశకు సమాంతరంగా ఉన్నందున 

B ) ఋతుపవనాలు రాజస్థాన్ భూ భాగం చేరే సమయానికి అందులో తేమశాతం తగ్గిపోవడం 

C ) హిమాలయాలు రాజస్తాన్ భూ భాగానికి దూరంగా ఉండటం 

D ) పైవన్నీ 


8. భారత దేశ వ్యవసాయ రంగాన్ని ఋతుపవనాలతో “ జూదం ఆడటం లాంటిది " గా పేర్కొనడానికి కారణం ?

 A ) ఋతుపవన కాలంలో అధిక వర్షపాతం సంభవించడం వలన 

B ) ఋతుపవనాల అనిశ్చితత్వం వలన 

C ) పశ్చిమ కనుమల ప్రాంతాల్లో అధిక వర్షపాతం వలన 

D ) దేశ వాయువ్య ప్రాంతము మరియు తమిళనాడు భూ భాగంలో సంభవించే శీతాకాల వర్షాల వలన 


9. క్రింది వాటిలో నిజమైన వాక్యాన్ని పరిశీలింపుము.

 A ) రాజస్థాన్ లోని పశ్చిమ భూ భాగం నుంచి సముద్ర జలరాసులు తిరోగమనం చెందటం మరియు శీతోష్ణ స్థితిలో మార్పుల కారణంగా ఏడారీకరణ విస్తరించింది.

 B ) తూర్పు కనుమలతో పోలిస్తే , పశ్చిమ కనుమల ప్రాంతం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది 

C ) ఆరావళి పర్వత పరిసరాల్లో ఎక్కువ వర్షపాతం సంభవించడానికి ఆరావళి పర్వతాలు కారణంగా ఉన్నాయి .

D ) దేశ ఈశాన్య ప్రాంతం తిరోగమన నైరుతి ఋతుపవనాల వలన ఎక్కువ వర్షపాతాన్ని పొందుతుంది . 


10. బ్రహ్మపుత్ర నదీలోయ శీతోష్ణస్థితికి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము .

1 ) ఈ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినది 

2 ) ఋతువును అనుసరించి పీడనా వ్యవస్థలో మార్పులు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి . 

3 ) పర్వత మరియు లోయ పవనాల ప్రభావం ఎక్కువ ఉంటుంది . 

4 ) వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది .

 A ) 1 మరియు 2

 B ) 2 మరియు 3

 C ) 1 , 2 మరియు 3

 D ) 1.3 మరియు 4 


11. నైరుతి ఋతుపవన కాలంలో తమిళనాడు పొడిగా ఉండటానికి కారణం .. 

A ) పశ్చిమ కనుమల పర్వత పరా పరాన్ముఖ దిశలో ఉండటం 

B ) ఋతుపవన గాలులు తమిళనాడు భూ భాగం చేరే సమయానికి అవి పొడిగా మారడం 

C ) బంగాళాఖాత ఋతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం 

D ) పైవన్నీ 


12. అక్టోబర్ హీట్ కి కారణం ? 

A ) బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆమ్రత ఉండటం 

B ) పొడి , వేడి వాతావరణం ఉండటం 

C ) పవనాల వేగం తక్కువగా ఉండటం 

D ) గంగా - సింధూ మైదానాల్లోని అల్ప పీడన వ్యవస్థలు 


13. దేశంలో నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనకాల ద్వారా వర్షాన్ని పొందే ప్రాంతం ? 

A ) నర్మదా నదిలోయ ప్రాంతం 

B ) కావేరీ నదిలోయ ప్రాంతం 

C ) కోరమండల్ తీరం 

D ) యమునా నదిలోయ ప్రాంతం 


14. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల తగినంత స్థాయిలో వర్షపాతం పొందే ప్రాంతం 

A ) సట్లెజ్ - యమునా మైదానం 

B ) చంబర్ - యమునా మైదానం 

C ) పశ్చిమ రాజస్థాన్ 

D ) కాశ్మీర్ లోయ 


15. భారతదేశంలో శీతోష్ణస్థితికి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము .

1. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటగానే 180 ° కోణంతో అపవర్తనం చెంది దేశ భూభాగంలోకి ప్రవేశిస్తాయి . 

2. నైరుతి ఋతుపవనాలు పొడి పవనాలు కాగా , ఈశాన్య ఋతుపవనాలు తడిపవనాలు 

3. ఈశాన్య వ్యాపార పవనాలే నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి . 

4. ఆగ్నేయ వ్యాపార పవనాలే నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి .

 A ) 2 మరియు 3

 B ) 1 మరియు 3

 C ) 1 మరియు 4

 D ) 2 మరియు 4

ANSWERS

1 A  2 A 3 B 4 A  5 A 6 D 7 A  8 B 

9 A 10 C 11 B 12 A 13 B 14 A C 15

Top Post Ad

Below Post Ad